Friday, September 12, 2025 05:22 PM
Friday, September 12, 2025 05:22 PM
roots

భూమి పై జీవం అంతం కానుందా..?

భూమిపై జీవం అంతం కానుందా..? శాస్త్రవేత్తలు త్వరలోనే ఆ తేదీలు ప్రకటించే అవకాశం ఉందా..? అంటే అవుననే సమాధానాలు వినపడుతున్నాయి. టోహో విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు.. నాసాకు చెందిన ప్లానెటరీ మోడలింగ్ ఉపయోగించి చేసిన సూపర్ కంప్యూటర్ సిమ్యులేషన్ ఆసక్తికర విషయాలు బయటపెట్టింది. భూమిపై జీవం పూర్తిగా అంతరించే అవకాశం ఉందని లెక్కలతో సహా అంచనా వేసింది. భూమిపై జీవ మనుగడకు కీలకమైన ఆక్సీజన్ కనుమరుగు అయ్యే అవకాశం ఉందని తేల్చింది.

Also Read : ప్రపంచ కప్ కష్టమే.. గవాస్కర్ సంచలన కామెంట్స్

సుమారు ఒక బిలియన్ సంవత్సరాలలో భూమిపై యొక్క ఆక్సిజన్ అదృశ్యమవుతుందని, మనుగడ అసాధ్యం అవుతుందని అంచనా వేసింది. ఈ అధ్యయనం 4,00,000 అంశాలను పరిశీలిస్తూ.. భూ వాతావరణాన్ని అంచనా వేస్తూ తేల్చి చెప్పింది. సూర్యుడు వయసు పెరిగే కొద్దీ, అది వేడిగా, ప్రకాశవంతంగా మారుతుంది. ఇది భూమి యొక్క వాతావరణాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని తేల్చింది. ఈ పరిణామాలతో.. నీరు ఆవిరైపోతుంది, ఉపరితల ఉష్ణోగ్రతలు పెరుగుతాయని తెలిపింది.

Also Read : వంశీ చార్జ్ షీట్ లో సంచలన విషయాలు

అలాగే కార్బన్ చక్రం బలహీనపడుతుందని.. మొక్కలు చనిపోతాయని వివరించింది. దీనితో ఆక్సీజన్ ఉత్పత్తి నిలిచిపోతుందని పేర్కొంది. వాతావరణం అధిక మీథేన్ స్థితికి తిరిగి వెళ్ళే అవకాశం ఉందని, ఇది అత్యంత ప్రమాదకరమని తేల్చింది. నేచర్ జియోసైన్స్‌లో దీనికి సంబంధించిన కథనాన్ని ప్రచురించారు. భూమి జీవిత కాలం కేవలం బిలియన్ సంవత్సరాలు మాత్రమే అని స్పష్టం చేసారు. భవిష్యత్తులో ఆక్సీజన్ స్థాయిలు పడిపోయే అవకాశం ఉందని.. అలాంటి వాతావరణంలో జీవం ఉన్నప్పటికీ.. చాలా భిన్నంగా ఉంటుందని పేర్కొన్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

పోల్స్