భారత్ – పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ద వాతావరణం తారా స్థాయికి చేరుతోంది. ఆపరేషన్ సిందూర్ కు ప్రతీకారంగా పాక్.. మన దేశంపై దాడి చేసేందుకు ప్రయత్నం చేస్తుండగా.. భారత ఆర్మీ వాటిని సమర్ధవంతంగా తిప్పి కొడుతోంది. ఇక తాజాగా మరోసారి భారత్ లో దాడులకు దిగింది పాక్ సైన్యం. జమ్మూ కాశ్మీర్ నుండి గుజరాత్ వరకు 26 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ శుక్రవారం రాత్రి ప్రారంభించిన క్షిపణి, డ్రోన్ దాడులను సైన్యం అడ్డుకుంది.
Also Read : భారత్‌పై పాకిస్థాన్ అణు దాడికి సాహసం చేస్తుందా..?
విమానాశ్రయాలు, వైమానిక స్థావరాలు, సహా కీలకమైన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ దాడులకు పాల్పడింది. ఈ విషయాన్నీ రక్షణ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. శ్రీనగర్ సహా పరిసర ప్రాంతాలలో భారత, పాకిస్తాన్ దళాల మధ్య తీవ్రమైన కాల్పులు జరుగుతున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వైమానిక దాడులను ఎదుర్కోవడానికి భారత దళాలు ఈ ప్రాంతంలో ఉపరితలం సహా గగనతలంలో క్షిపణి వ్యవస్థలను యాక్టివేట్ చేసాయి. పెద్ద ఎత్తున సరిహద్దుల్లో బలగాలను మొహరించారు.
Also Read : పాకిస్తాన్ కు సైలెంట్ గా అమెరికా హెల్ప్..?
ఇక పాకిస్తాన్ కు భారత్ చుక్కలు చూపిస్తోంది. పాకిస్తాన్‌లోని నాలుగు కీలక వైమానిక స్థావరాలపై భారత్ రాత్రి సమయంలో విజయవంతంగా దాడి చేసి, సైనిక స్థావరాలు, ఆస్తులకు భారీ నష్టం కలిగించాయని ప్రభుత్వ వర్గాలు శనివారం తెలిపాయి. రావల్పిండిలోని నూర్ ఖాన్, చక్వాల్‌లోని మురిద్, షోర్కోట్‌లోని రఫికి వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసాయి. పాకిస్తాన్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటల వరకు తన గగనతలాన్ని మూసివేసింది. ఈ తరుణంలో పాక్ అధ్యక్షుడు షరీఫ్.. అణు కమాండ్ బాడీ సమావేశానికి ఆదేశాలు ఇచ్చారు. దాడులు తీవ్రతరమైతే ఎలా ఎదుర్కోవాలనే దానిపై పాకిస్తాన్ సన్నద్దమవుతోంది.