Friday, September 12, 2025 07:25 PM
Friday, September 12, 2025 07:25 PM
roots

ధనుంజయ రెడ్డి అరెస్ట్..? ఎంటర్ అయిన ఈడీ..?

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఆసక్తి ఇటు జనాల్లో కూడా పెరిగిపోతుంది. తాజాగా మద్యం కుంభకోణంలో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ కావడం ఆసక్తిని రేపుతోంది.. మద్యం కుంభకోణం విషయంలో మనీలాండరింగ్ జరిగింది అనేది ప్రధాన ఆరోపణ. ఆంధ్రప్రదేశ్ లో డిజిటల్ పేమెంట్లు లేకుండా కేవలం క్యాష్ తీసుకుని మద్యం విక్రయాలను చేపట్టారు అనేది అప్పట్లో ఎక్కువగా వినపడింది.

Also Read : జగన్ ఇంటి తలుపు తట్టిన లిక్కర్ స్కామ్

దాదాపు 99 వేల కోట్ల మద్యం విక్రయిస్తే అందులో 96% కేవలం డిజిటల్ పేమెంట్లు లేకుండానే నగదు తీసుకున్నారు. దీనిపై తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ ఆక్ట్ కింద కేసు నమోదుకు రంగం సిద్ధం చేశారు. ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేసేందుకు తమకు ఆధారాలు కావాలని ప్రత్యేక దర్యాప్తు బృందం అధిపతి, విజయవాడ సి పి రాజశేఖర్ కు ఈడి అధికారులు లేఖ రాశారు. కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ అలాగే ఇప్పటివరకు సీజ్ చేసిన బ్యాంక్ అకౌంట్ ల వివరాలు పంపాలని ఈడీ అధికారులు కోరారు.

Also Read : ఏపీ భవిష్యత్తు నిర్మిస్తున్నాం.. లోకేష్ ఆసక్తికర కామెంట్స్

ఇక తాజాగా ఈ వ్యవహారంలో ఓ విషయం వైరల్ అవుతోంది. ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఐఏఎస్ ధనుంజయ రెడ్డి అరెస్ట్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. హైదరాబాదులో అరెస్టు చేసిన సిట్ అధికారులు.. విజయవాడ తరలిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. లిక్కర్ పాలసీ రూపకల్పన ముడుపుల వసూళ్లు లో ప్రమేయం ఉన్న కీలకమైన వ్యక్తిగా అతన్ని భావిస్తున్నారు. ఇక అతని ఇంట్లో కూడా అధికారులు సోదాలు చేసారు. అటు జగన్ మాజీ ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డి నివాసంలో కూడా సోదాలు జరిపినట్టు సమాచారం.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్