జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడి తర్వాత భారత్ – పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధం జరుగుతుందనే వార్తలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. రెండు దేశాల మధ్య వాతావరణం రోజు రోజుకు ఆందోళన కలిగిస్తోంది. ఇక బుధవారం తెల్లవారుజామున భారత ఆర్మీ.. ఆపరేషన్ సిందూర్ లో భాగంగా పాకిస్తాన్ పై దాడులకు దిగింది. ఈ దాడుల్లో మొత్తం వంద మంది ఉగ్రవాదులను హతమార్చాయి భారత బలగాలు. ఈ సమయంలో పాకిస్తాన్ కూడా దాడికి దిగే అవకాశం ఉందని, రెండు దేశాల మధ్య యుద్ద సైరన్ మోగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Also Read : ఆపరేషన్ సిందూర్.. శాటిలైట్ ఫోటోలు బయటపెట్టిన వాస్తవాలు
అయితే యుద్ధం జరిగితే మన భారత సైన్యం బలం ఎంత అనేది ఒకసారి చూద్దాం. ‘గ్లోబల్ ఫైర్ పవర్’ వెబ్‌సైట్ ప్రకారం 2025 మిలటరీ ర్యాంకింగ్‌లలో భారత్.. పాకిస్తాన్ కంటే చాలా ముందుంది. 2025లో అంతర్జాతీయ సైనిక శక్తికి సంబంధించి 145 దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో ఉండగా దాయాది పాక్.. 12 వ స్థానంలో ఉంది. భారత్ దగ్గర దాదాపు 22 లక్షల సైన్యం ఉండగా.. 4,201 యుద్ధ ట్యాంకులు ఉన్నాయి. దాదాపు లక్షా 50 వేల ఆర్మర్డ్ వెహికల్స్ ఉన్నాయి. ఇక 100 సెల్ఫ్ ప్రొపెల్డ్ ఆర్టిలరీ, 3,975 టోవ్డ్ ఆర్టిలరీ ఉన్నట్టు లెక్కలు చెప్తున్నాయి.
Also Read : కడిగిన ముత్యంలా ఏబీవీ..!
అలాగే మల్టీ బారెల్ రాకెట్ ఆర్టిలరీ 264 ఉన్నాయని వెబ్ సైట్ వెల్లడించింది. మన ఎయిర్ ఫోర్స్ వద్ద 3 లక్షల10 వేల మంది బలగం ఉండగా మొత్తం 2,229 విమానాలున్నాయి. వాటిలో 513 ఫైటర్ విమానాలు కాగా, 270 రవాణా విమానాలు. 130 అటాక్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, 351 శిక్షణ విమానాలు, ఆరు ట్యాంకర్ ఫ్లీట్ ఎయిర్‌క్రాఫ్ట్ లు ఉన్నట్టు లెక్కలు చెప్తున్నాయి. భారత సైన్యానికి చెందిన మూడు విభాగాల దగ్గర 899 హెలికాప్టర్లు ఉండగా.. వాటిలో 80 అటాక్ హెలికాప్టర్లు ఉన్నాయి. భారత నౌకాదళం దగ్గర లక్షా 42 వేలమంది సెయిలర్లు ఉన్నారు. రెండు విమాన వాహక నౌకలు సహా మొత్తం 293 నౌకలున్నాయి. వాటిలో 13 డిస్ట్రాయర్లు, 14 ఫ్రిగేట్లు, 18 సబ్‌మెరైన్లు, 18 కర్వెట్టీలు ఉన్నాయి. భారత ఆర్మీ పరిధిలో 311 ఎయిర్‌పోర్టులు, 56 పోర్టులు ఉన్నాయి. అవసరమైతే దేశంలో ఏ విమానాశ్రయాన్ని అయినా క్షణాల్లో తమ ఆధీనంలోకి తీసుకోగలరు.




