Friday, September 12, 2025 11:02 PM
Friday, September 12, 2025 11:02 PM
roots

ఆపరేషన్ సక్సెస్.. దెబ్బ అదుర్స్..!

భారత సైన్యం స్పెషల్ ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. మొత్తం 9 చోట్ల మిసైల్స్‌తో భారత సైన్యం అటాక్ చేసింది. అయితే ఇక్కడే అసలు విషయం గుర్తించాలి. ఈ దాడులు చేసే సమయంలో భారత సైన్యం పాకిస్థాన్‌లోకి ఎంటర్ కాలేదు. మన దేశ సరిహద్దు నుంచే పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసి ప్రతికారం తీర్చుకుంది. పాకిస్తాన్, పీఓకేలో 9 ఉగ్ర స్థావరాలపై భారత్ దాడులు చేసింది. ఈ దాడులను పహల్గామ్ దాడికి ప్రతికార చర్యగా భారత సైన్యం అధికారికంగా ప్రకటించింది. అదే సమయంలో ఈ దాడులు ఇక్కడితో ఆగవని.. మరిన్ని దాడులు జరుగుతాయని కూడా ఆర్మీ అధికారులు వెల్లడించారు. లష్కరే, జైషే, హిజ్బుల్ ముజాహిదీన్ స్థావరాలు ప్రధాన లక్ష్యాలుగా త్రివిధ దళాలు సమన్వయంతో భారీ సైనిక చర్య చేపట్టింది భారత్. అదే సమయంలో ప్రధాన అంతర్జాతీయ దేశాలకు కూడా భారత్ దౌత్యపరమైన వివరణ ఇచ్చింది.

Also Read : ఆపరేషన్ సిందూర్ కు జై కొట్టిన అగ్ర దేశాలు

జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో అమాయక పౌరులపై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో 9 ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేసింది. ఈ ప్రాంతంలో దీర్ఘకాలంగా కొనసాగుతున్న అత్యంత కీలకమైన ఉగ్రవాద శిక్షణా కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది సాధారణ పౌరులు మరణించారు. ఈ దాడి వెనుక పాకిస్తాన కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ హస్తం ఉన్నట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో లష్కరే తోయిబా, జైషే మహ్మద్ (జేఈఎం), హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ఉగ్రవాద సంస్థలు వినియోగిస్తున్న రవాణా, కార్యకలాపాలు, శిక్షణకు సంబంధించిన కీలక మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా భారత్ ప్రతీకార దాడులకు దిగింది.

Also Read : ఆపరేషన్ సిందూర్ అని ఎందుకు పెట్టారు..?

పాకిస్తాన్‌లోని దక్షిమ పంజాబ్‌లో ఉన్న బహవల్పూర్, మసూద్ అజార్ నేతృత్వంలోని జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు ప్రధాన కేంద్రం. 2001 పార్లమెంట్ దాడి, 2019 పుల్వామా ఆత్మాహుతి దాడి వంటి అనేక దాడులకు ఈ సంస్థ బాధ్యత వహించింది. ఇక లాహోర్‌కు సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న మురిడ్యే ప్రాంతం లష్కరే తోయిబా, జమాత్ ఉద్‌దవాకు దీర్ఘకాలంగా కీలక స్థావరంగా ఉంది. 200 ఎకరాలకు పైగా విస్తరించి ఉన్న ఈ ఉగ్రవాద కేంద్రంలో శిక్షణ ప్రాంతాలు, భావజాల వ్యాప్తి కేంద్రాలున్నాయి. 2008 ముంబై దాడుల వెనుక లష్కరే తోయిబా హస్తం ఉందని భారత్ ఆరోపిస్తోంది. 26/11 దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు ఇక్కడే శిక్షణ పొందినట్లు సమాచారం.

Also Read : 1971 తర్వాత తొలిసారి.. ఆపరేషన్ సిందూర్ తో పాక్ కు చుక్కలు

అలాగే పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని కోట్లీ ఆత్మాహుతి బాంబర్లు, తిరుగుబాటుదారులకు ప్రధాన శిక్షణ కేంద్రం. ఇక జమ్ముకశ్మీర్‌లోని రాజౌరి, పూంచ్ ప్రాంతాల్లో కార్యకలాపాల కోసం 2023, 2024లో గుల్పూర్‌ను ఫార్వర్డ్ లాంచ్ ప్యాండ్‌గా పదే పదే ఉపయోగించినట్లు తెలుస్తోంది. అలాగే అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖకు సమీపంలో ఉన్న సర్జల్, బర్నాలా చొరబాటుసకు కీలక మార్గాలుగా గుర్తించింది భారత సైన్యం. వీటితో పాటు సియాల్‌కోట్ సమీపంలోని మెహమూనా శిబిరాన్ని కశ్మీర్‌లో చారిత్రాత్మకంగా చురుకుగా ఉన్న హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ ఉపయోగిస్తోంది. వీటిపైనే ఇప్పుడు భారత సైన్యం దాడులు చేసి నాశనం చేసింది. సుమారు 80 మంది వరకు ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది. కానీ ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని భావిస్తున్నారు. ఇదే సమయంలో “అబీ పిచ్చర్ బాకీ హై” ఇండియాన్ ఆర్మీ చీఫ్ మనోజ్ నరవనీ చేసిన కామెంట్ మరిన్ని దాడులు జరుగుతాయని తెలుస్తోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్