Friday, September 12, 2025 07:25 PM
Friday, September 12, 2025 07:25 PM
roots

కూటమి సర్కారుపై జగన్‌ ముఠా మరో కొత్త వ్యూహం..!

వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. ఇంకా చెప్పాలంటే వైసీపీ అడ్రస్ కూడా గల్లంతైంది. అందుకే అప్పటి వరకు తాడేపల్లిలో ఉన్న పార్టీ ఆఫీసును కూడా మూసేసి… జగన్ ఇంట్లోకి మార్చేశారు. ఇక జగన్ కూడా తన మకాం తాడేపల్లి నుంచి బెంగళూరు మార్చేశారు. వారంలో 2 రోజులు తాడేపల్లిలో ఉంటూ వర్క్ ఫ్రం బెంగళూరు అన్నట్లుగా ప్రస్తుతం విజయవాడ – బెంగళూరు మధ్య షటిల్ సర్వీస్ చేస్తున్నారు జగన్. అలాగే రాని ప్రతిపక్ష హోదా కోసం ఇప్పటికీ గోల చేస్తూనే ఉన్నారు తప్ప.. అసలు మనకు 11 సీట్లు మాత్రమే ఎందుకు వచ్చాయని కనీసం ఆలోచించుకోవటం లేదు.

Also Read : కావలి మాజీ ఎమ్మెల్యేకి మూడిందా..?

జగన్ ప్రస్తుతం చచ్చిన పాముతో సమానం. అలా అని ఆయన్ని అంత ఈజీగా తీసుకునే పరిస్థితి లేదు. జగన్ అనే వ్యక్తి చాలా ప్రమాదకరం. రాజకీయాల్లో ఇలాంటి వారికి అస్సలు చోటు లేదు. ఎందుకంటే.. అధికారంలోకి వచ్చేందుకు ఏ స్థాయికైనా దిగజారి పోతారు. 2019 ఎన్నికలకు ముందు సొంత బాబాయ్ హత్య కేసు ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. అలాగే 2024 ఎన్నికల ముందు కూడా విజయవాడలో గులక రాయి దాడి.. ఎన్నికల్లో గెలుపు కోసం, అధికారం కోసం జగన్ ఏ పని చేయడానికి అయినా సరే సిద్ధం. అందుకే 2024 ఎన్నికల ముందు సిద్ధం.. సిద్ధం అంటూ సభలు పెట్టారు.

Also Read : జగన్ ధనదాహానికి దేవుడిచ్చిన అన్న బలి..!

ప్రస్తుతం విపక్షంలో ఉన్న జగన్ ముందు ఉన్న అజెండా ఒకటే. అదేమిటంటే అధికారంలోకి రావడం ఎలా.. ఇందుకోసం ఏం చేయాలి.. ఎలాంటి పనులు చేయాలి.. ఇదే జగన్ ముందు ఉన్న ఏకైక లక్ష్యం. ఇందుకోసం 2019 ఎన్నికలకు ముందు ఎంచుకున్న మార్గాన్నే ఇప్పుడు కూడా అనుసరిస్తున్నారు. అబద్ధాలు చెప్పడం.. కులాల మధ్య చిచ్చు పెట్టడం.. జరగని విషయాలను జరిగినట్లు కనికట్టు చేయడం.. ఇదే జగన్ చేసే పనులు. 2019 ముందు తిరుమలలో పింక్ డైమండ్ చోరీ అని తప్పుడు ప్రచారం చేశారు జగన్. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అలా ఏం లేదని కోర్టులో వేసిన కేసులు వెనక్కి తీసుకున్నారు. ఇక బాబాయ్‌ని చంద్రబాబు హత్య చేయించారంటూ.. నారా సుర రక్త చరిత్ర అంటూ తప్పుడు వార్తలు రాయించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని కాపాడేందుకు ఇప్పటికీ నానా పాట్లు పడుతున్నారు జగన్.

Also Read : టీడీపీలో నం.3 ఎవరో తెలుసా..?

ఇక ఇప్పుడు ఓడి కనీసం ఏడాది కూడా కాలేదు.. కానీ అప్పుడే అధికారం కోసం కుట్రలు మొదలుపెట్టాడు. వారం వారం హైదరాబాద్‌లో రహస్యంగా మీటింగులు పెడుతున్నట్లు మాకు తెలుస్తోంది. ఈ సమావేశాలకు జగన్ సొంత జిల్లా కడప జిల్లాకు చెందిన ఓ మాజీ ఐఏఎస్ అధికారి సారధ్యం వహిస్తున్నట్లు మాకు స్పష్టంగా తెలుస్తోంది. ఈ మాజీ ఐఏఎస్‌కు కొందరు రిటైర్డ్ అధికారులతో పాటు.. ప్రస్తుతం కొందరు అధికారులు కూడా సహాయం అందిస్తున్నట్లు తెలిసింది. ఈ దొంగల ముఠాలో పాతిక మంది పైగానే ఉన్నారు. వీళ్ల అజెండా ఒక్కటే… జగన్ కళ్లల్లో ఆనందం చూడటం. రాష్ట్రాన్ని జగన్ దోచుకుంటుంటే.. వీరంతా తమ వంతు సహకారం అందిస్తూ.. వాళ్లు కూడా అందినంత మేర దోచుకోవడానికే ఈ ప్రయత్నం.

Also Read : గంటా సమస్యకు దొరికిన పరిష్కారం..!

చంద్రబాబు నాయుడుకు పరిపాలనపై గట్టి పట్టుంది. నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు.. పరిపాలన పరంగా ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందులు పడలేదు. ఎవరైనా అధికారి తప్పు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. అలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అందుకే ఆయనకు పని రాక్షసుడు అని పేరు. చంద్రబాబు దగ్గర పని చేయాలంటే.. వాళ్లు కూడా పనిమంతులు అవ్వాల్సిందే. కానీ జగన్ పాలనలో బద్దకస్తులే ఎక్కువగా ఉన్నారు. కనీసం కార్యాలయం ముఖం కూడా చూడని అధికారులు కూడా ఉన్నారు. ఏదో వారానికో, నెలకో ఓసారి అలా వెళ్లి వచ్చి.. ఇలా జీతం డబ్బులు తీసుకున్న వాళ్లు కూడా ఉన్నారు. ఇక లంచాల సంగతి సరే సరి. ప్రతి పనికి కమిషన్ చెల్లించాల్సిందే.

Also Read : అమరావతిపై ద్వేషం.. వైసీపీని మించిన బీఆర్ఎస్

ఇలాంటి వారంతా ఇప్పుడు ఏకమవుతున్నారు. లోపాయకారిగా జగన్‌కు అనుకూలంగా పావులు కదిపేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుత కూటమి సర్కార్ పై తప్పుడు ఆరోపణలు చేసేందుకు తమకున్న బ్యూరో క్రాట్ తెలివితేటల్ని వాడేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న అధికారులతో మంతనాలు జరుపుతున్నారు. ఇందులో ఒకరికి జగన్ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఓ అధికారికి అయితే వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తానని వలేస్తున్నాడని తెలిసింది. అందుకే రాజధానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఆ ఆఫీసర్ జగన్ అండ్ కో కు చేరవేస్తున్నట్లు మా దగ్గర సమాచారం ఉంది. ఆ అధికారి పేరు, హోదా అన్ని త్వరలోనే బయటపెడతాం. ఆయనే కాదు.. అలాంటి వారి డేటా మొత్తం బయటపెట్టి.. ప్రజలకు దొంగల నిజస్వరూపం చూపిస్తాం.

Also Read : టీడీపీ సోషల్ మీడియాకు గుర్రంపాటి బెదిరింపులు

అమరావతిపై జగన్ సైకోలు విషం కక్కడం మొదలుపెట్టారు. ఐదేళ్ల జగన్ పాలనలో కనీసం ఒక్క ఇటుక కూడా పెట్టలేదు. రాజధాని అమరావతి ప్రాంతాన్ని ముంపు ప్రాంతమని తప్పుడు ప్రచారం చేసేందుకు నానా పాట్లు పడ్డారు. కృష్ణా నదికి వరద వస్తే.. ప్రకాశం బ్యారెజ్ నుంచి దిగువకు వదలకుండా.. చంద్రబాబు ఇల్లు మునిగిపోయిందని చూపించేందుకు జగన్ ప్రభుత్వం కుట్ర చేసింది. దీంతో నీరు వెనక్కి తన్నింది. అలా పునాదుల్లో చేరిన నీరు రోజుల తరబడి నిలబడి పోవడంతో.. బురద పేరుకుపోయింది. ఇక అమరావతి గ్రామాల్లోకి నీరు చేరిన వీడియోలను అప్పట్లో వైసీపీ సోషల్ మీడియా సైకోలు తెగ సర్క్యూలేట్ చేశారు. ఇక్కడే అమరావతి కట్టాలని అనుకుంటున్నారు.. అప్పుడు అంతా మునిగిపోతామని ప్రచారం చేశారు.

Also Read : కడప బీనామీలే కేసిరెడ్డి బలం..? విచారణలో సంచలనాలు..?

ఇప్పుడు అవే వీడియోలను వైసీపీ అనుకూల మీడియా మరోసారి పోస్ట్ చేస్తోంది. గ్రేట్ ఆంధ్ర, ఉత్తరాంధ్ర నౌ వంటి వైసీపీ పెయిడ్ మీడియా… పాత వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. ప్రభుత్వ కార్యాలయాల భవనాలు వస్తున్నాయంటూ కామెంట్ పెట్టారు. ఇచ్చోటనే అంటూ సత్యహరిశ్చంద్ర స్మశానం నుంచి చెప్పిన మాటను… అమరావతికి ఆపాదిస్తూ.. దుర్మార్గపు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలా అమరావతిని స్మశానంతో పోల్చిన నాటి స్పీకర్ తమ్మినేని సీతారాం.. అడ్రస్ లేకుండా పోయారు. అయినా సరే.. ఏ మాత్రం బుద్ది రాని వైసీపీ సోషల్ సైకోలు మళ్లీ అదే తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు. వర్షం వస్తే నీరు నిలబడటం సహజం. దానిని దిగువకు వెళ్లే మార్గం ఏర్పాటు చేస్తే చాలు. అమరావతి ప్లాన్డ్ సిటీ. అక్కడ రహదారులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, కరెంట్ సరఫరా ఇలా ప్రతి విషయంలో కూడా అడ్వాన్స్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. ఎంత పెద్ద వరద వచ్చినా సరే… చుక్క నీరు కూడా రోడ్డుపై నిలబడే అవకాశం లేకుండా డ్రైనేజ్ సిస్టమ్ డిజైన్ చేశారు. మరి అలాంటి చోట నీరు ఎందుకు ఉంటుంది. కానీ వైసీపీ సైకోలు మాత్రం.. పునాదుల్లో ఉన్న నీటిని బయటకు తోడకపోగా.. గ్రామాలకు గ్రామాలు మునిగిపోయేలా కుట్ర చేసిందే కాకుండా… అదేదో ముంపు ప్రాంతమని… అక్కడ రాజధాని నిర్మిస్తే ప్రజలంతా మునిగిపోతారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇలా ఫేక్ ప్రచారం వల్ల… పెట్టుబడిదారులు రాకుండా అడ్డుకోవాలని కుట్ర చేస్తున్నారు. అధికారం కోసం ఎంత నీచానికి అయినా దిగజారేందుకు జగన్ రెడీ. అందుకే ఆంధ్రుల కలల రాజధాని అమరావతిపై జగన్ సైకోలు విషం చిమ్ముతున్నారు. సోషల్ మీడియాలో తప్పుడు వీడియోలు పోస్ట్ చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్