ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు కూటమి సర్కార్ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది. ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిస్తే చాలు.. అది ఎంత చిన్న సమస్య అయినా.. పెద్ద సమస్య అయినా సరే.. దానికి జవాబు చూపిస్తారు చంద్రబాబు. రాష్ట్ర ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం కూడా కిందికి దిగాల్సిందే. ఇదే విషయం మరోసారి రుజువు చేశారు. సరిగ్గా పది రోజుల క్రితం సోషల్ మీడియా వేదికదా వేసిన ప్రశ్నకు ఇప్పుడు పరిష్కారం చూపించారు. దీనిపై విపక్షాలు ఆరోపణలు చేసినప్పటికీ.. ప్రభుత్వం మాత్రం.. ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఎవరైనా సరే వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిందే అంటూ కూటమి సర్కార్ మరోసారి నిరూపించింది.
Also Read : టీడీపీలో నం.3 ఎవరో తెలుసా..?
విశాఖపట్నం నుంచి అమరావతి వచ్చేందుకు ప్రయాణీకులు ఇబ్బంది పడుతున్నారంటూ సరిగ్గా ఈ ఏడాది ఏప్రిల్ 15వ తేదీన భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సోషల్ మీడియా వేదికగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దృష్టికి తీసుకువచ్చారు. ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ నుంచి పరిపాలన రాజధాని అమరావతి చేరాలంటే తెలంగాణ రాజధాని హైదరాబాద్ మీదుగా వెళ్లాల్సి రావడం బాధాకరం అంటూ పోస్ట్ పెట్టారు. ఉదయం 8 గంటలకు విశాఖ ఎయిర్ పోర్టు వచ్చిన విమానంలో హైదరాబాద్ చేరి.. అక్కడి నుంచి విజయవాడ విమానం ద్వారా గన్నవరం మధ్యాహ్నం 1 గంటకు చేరుకున్నామన్నారు గంటా. ఆంధ్రా టూ ఆంధ్రా.. వయా తెలంగాణ అని వ్యాఖ్యానించిన గంచా.. విశాఖ విమాన ప్రయాణీకుల దుస్థితి.. అంటూ ఎమ్మెల్యే గంటా వ్యాఖ్యలు చేశారు.
Also Read : ఒరాకిల్ తో ఏపి ప్రభుత్వం సంచలన ఒప్పందం
గంటా శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారం రేపాయి కూడా. అధికార పార్టీ ఎమ్మెల్యేనే ఇలా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా వ్యాఖ్యలు చేయడం ఎంత వరకు సమంజసం అంటూ కొందరు ప్రశ్నించారు. ఇదే అవకాశంగా విపక్షాలు, వైసీపీ సోషల్ మీడియా కూడా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించింది. విశాఖ నగరంపై ప్రభుత్వం కక్ష సాధిస్తోందంటూ తప్పుడు ఆరోపణలు చేశారు. అయితే వీటన్నిటికీ ప్రభుత్వం సైలెంట్‌గా పరిష్కారం చూపించింది.
Also Read : ఐదేళ్ల తర్వాత మేలుకుంటున్న మేధావులు..!
ఈ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించిన కేంద్ర పౌర విమానయాన శాఖ.. సమస్యకు పరిష్కారం చూపించింది. విజయవాడ – విశాఖపట్నం – విజయవాడ మధ్య గతంలో ప్రతిరోజు ఉదయం నడిచిన విమాన సర్వీసును పునరుద్ధరిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ప్రతి ఉదయం 7.15 గంటలకు గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విశాఖకు బయరుదేరిన విమానం.. ఉదయం 8.25 గంటలకు చేరుకుంటుంది. అక్కడి నుంచి తిరిగి 8.45 గంటలకు బయలుదేరి ఉదయం 9.50 గంటలకు గన్నవరం చేరుకుంటుంది. ఈ సర్వీసు జూన్ 1 నుంచి అందుబాటులోకి వస్తుందని ఇండిగో సంస్థ వెల్లడించింది.
Also Read : కావలి మాజీ ఎమ్మెల్యేకి మూడిందా..?
కేంద్రం ప్రకటనకు ఎమ్మెల్యే గంటా సోషల్ మీడియా వేదికగానే కృతజ్ఞతలు తెలిపారు. “విశాఖ నుంచి విజయవాడకు ఉదయం వేళల్లో విమానం పునరుద్ధరిస్తూ తీసుకున్న నిర్ణయం ఉత్తరాంధ్ర వాసులకు ఊరటనిచ్చే విషయం. జూన్ 1 నుంచి ఇండిగో సర్వీసు మళ్లీ ప్రవేశపెట్టడానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పూనుకోవడం సంతోషం. ఆయనకు అభినందనలు. సాధారణ ప్రయాణీకులు సహా వ్యాపార వర్గాల వారికి ఉపయుక్తంగా ఉండే ఈ సర్వీసు మాదిరిగా మరిన్ని విమానాలను విశాఖ నుంచి ప్రవేశపెడతారని ఆశిస్తున్నా..” అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై ఉత్తరాంధ్ర వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.