తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ విశ్వవిద్యాలయం. అందులో నుంచి ఎందరో నాయకులు పుట్టారు. ఎంతో కీలకంగా ఎదిగారు. టీడీపీ లీడర్స్ బ్రహ్మాండంగా తయారు చేసే ఫ్యాక్టరీ అన్న చంద్రబాబు మాటలలో నూటికి నూరు శాతం సత్యం ఉంది. ఆ వరుసలో కీలక నేతల వారసులు కూడా రాజకీయం అందుకుంటున్నారు. టీడీపీ వారసులు కూడా బాబు డైరెక్షన్‌లో బాగానే సక్సెస్ అవుతున్నారని చెప్పాల్సి ఉంది. అందులో అగ్రభాగాన కింజరాపు వారి వారసుడు ఉన్నారు. దివంగత ఎర్రన్నాయుడు కుమారుడు అయిన రామ్మోహన్ నాయుడు వారసుడిగా అడుగు పెట్టినా తండ్రిని మించిన తనయుడిగా రుజువు చేసుకుంటునారు.
Also Read : పెద్దిరెడ్డిని కాపాడుతున్న అధికారులు
గట్టిగా నాలుగు పదుల వయసు లేదు.. కీలకమైన కేంద్ర పౌర విమాన యాన శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు రామ్మోహన్‌నాయుడు. పార్టీలో, ప్రభుత్వంలో అత్యంత కీలకంగా ఉన్నారు. టీడీపీలో చంద్రబాబు, లోకేష్ తరువాత మూడో పేరు కచ్చితంగా రామ్మోహన్‌దే వినిపిస్తోంది. ఇక ఢిల్లీ స్థాయిలో ఆయన టీడీపీ హవా చాటుతున్నారు. కేంద్రం నుంచి నిధులను సాధించి పెట్టడంతో పాటుగా కేంద్రం ప్రకటించిన కార్యక్రమాలను ఏపీకి చేరువ చేసే పనిలో ఉన్నారు. అదే విధంగా చంద్రబాబు ఢిల్లీకి వెళ్తే కేంద్ర మంత్రుల నుంచి కేంద్ర పెద్దల దాకా అపాయింట్‌మెంట్లు తీసుకుని ఆయన పర్యటనను సక్సెస్ చేయడంలో రామ్మోహన్ ముఖ్య భూమిక పోషిస్తున్నారు.
Also Read : నేను, పవన్, మోదీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం
రామ్మోహన్‌కు నిబద్ధత ఉంది. అలాగే పనితీరులో జోరు ఉంది. తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఎంతో నైపుణ్యం ఉంది. అందుకే ఆయన మోడీ సభలో అనువాదకుడిగా మారి పెద్దాయన ప్రశంసలు అందుకున్నారు. అమరావతి సభలో మోడీ మాట్లాడిన ప్రతీ మాటకు పూర్తిగా తెలుగులో అనువదించి ప్రధాని మనసులోని మాటలను జనాలకు చేర్చడంతో రామ్మోహన్ సెంట్ పర్సెంట్ సక్సెస్ అయ్యారు. మరో వైపు చూస్తే ఆయన పట్ల అటు చంద్రబాబు కానీ, ఇటు ప్రధాని నరేంద్ర మోడీ కానీ ప్రత్యేక అభిమానాన్ని చూపిస్తున్నారు. చిన్న వయసులో ఉన్నత పదవులు అందుకోవడమే కాదు వాటిని సమర్థంగా నిర్వహిస్తున్న రామ్మోహన్‌కు ఎంతో భవిష్యత్తు ఉందని అంతా భావిస్తున్నారు. ఇక చంద్రబాబు అయితే లోకేష్ తరువాత అంతటి ప్రాధాన్యత రామ్మోహన్‌కి ఇస్తున్నారు. రామ్మోహన్‌ని తన టీంలో కీలక స్థానంలో ఉంచుతున్నారు లోకేష్.
Also Read : కావలి మాజీ ఎమ్మెల్యేకి మూడిందా..?
ఇలా అన్ని విధాలుగా చూస్తే రామ్మోహన్ బాగా జోరు చూపిస్తున్నారు. అనూహ్యంగా టీడీపీలో అగ్ర స్థానంలోకి వెళ్తున్నారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీని ఆయన తానే అన్ని అయి నడిపిస్తున్నారు. రామ్మోహన్ ఢిల్లీలో ఉంటే చాలు అనే భరోసా అయితే పార్టీ పెద్దల్లో ఉంది. బాగా పనిచేసిన నేతలను చంద్రబాబు ఎపుడూ ఇష్టపడతారు. అలా చూసుకుంటే రామ్మోహన్ టీడీపీకి తిరుగులేని నాయకుడిగా ఆయన కూడా భావిస్తున్నారు. ఉత్తరాంధ్రకు చెందిన ఈ బీసీ నేత పార్టీకి ఎంతగానో ఉపయోగపడుతున్నారు అని అంటున్నారు. చంద్రబాబుకు ఆనాడు ఎర్రన్నాయుడు మాదిరిగా రేపటి రోజున లోకేష్‌కు రామ్మోహన్ ఉంటారని కూడా చెబుతున్నారు. ఏది ఏమైనా అందరి చేతా శభాష్ అనిపించుకుంటున్న రామ్మోహన్‌కు రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉంది.