Monday, October 27, 2025 10:33 PM
Monday, October 27, 2025 10:33 PM
roots

కావాలనే తగలబెట్టారా..? కేంద్ర హోంశాఖకు నివేదిక

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి పనుల పునః ప్రారంభానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా విచ్చేసిన సంగతి తెలిసిందే. పదేళ్ల క్రితం పనులకు శంకుస్థాపన చేసిన మోడీ మరోసారి పున ప్రారంభానికి హాజరు కావడం పలు పనులకు శంకుస్థాపన చేయడం వంటివి జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా అన్ని పార్టీల కార్యకర్తలు, ప్రజలు హాజరయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగానికి కూడా విశేష స్పందన వచ్చింది.

Also Read : లోకేష్‌ పదవిపై ఫుల్ క్లారిటీ..!

అమరావతి పనులు మరింత వేగవంతం అవుతాయని సంకేతాలు కూడా వెళ్లాయి. ఇదిలా ఉంచితే ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న రెండు ఘటనలు ఆశ్చర్యం కలిగించాయి. ప్రధానమంత్రి గన్నవరం విమానాశ్రయంలో దిగే సమయానికి చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం సంచలనమైంది. విమానాశ్రయం కోసం సేకరించిన భూముల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి 7 ఎకరాల్లో చెట్లు కాలిపోయాయి. ఇక ఆ తర్వాత ప్రధానమంత్రి హెలికాఫ్టర్ లో సభా స్థలానికి చేరుకునే సమయానికి చోటు చేసుకున్న ఘటనలో.. పెద్ద ఎత్తున ఎల్ అండ్ టి కంపెనీకి చెందిన పైపులు కాలిపోయాయి.

Also Read : రామ్ చరణ్ ను “గ్లోబల్ స్టార్” ట్యాగ్ భయపెడుతోందా..?

రెండు సందర్భాల్లో కూడా మోడీ.. దిగుతున్న సమయానికే మంటలు చెలరేగడం ఆశ్చర్యం కలిగించింది. దీనికి సంబంధించిన వీడియోలు పలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సరిగ్గా మోడీ వచ్చే సమయానికి కావాలనే కొంతమంది మంటలు చెలరేగేలా ప్రణాళిక ప్రకారం.. చేశారని ఆరోపణలు వస్తున్నాయి. ఇక దీనిపై ప్రధానమంత్రి భద్రత అధికారులు కూడా సీరియస్ అయినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఎన్ ఎస్ జి అధికారులు కేంద్ర హోంశాఖకు నివేదిక పంపారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఘటనపై దర్యాప్తు వేగవంతం చేసింది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్