Monday, October 27, 2025 10:33 PM
Monday, October 27, 2025 10:33 PM
roots

లోకేష్‌ పదవిపై ఫుల్ క్లారిటీ..!

నారా లోకేష్.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పవర్ ఫుల్ లీడర్. తెలుగుదేశం పార్టీ ఫ్యూచర్ లీడర్‌గా ప్రస్తుతం నారా లోకేష్ ఫుల్ యాక్టివ్‌గా ఉన్నారు. 2014 నుంచి పాలిటిక్స్‌లో యాక్టివ్‌గా ఉన్నప్పటికీ.. పాదయాత్రకు ముందు.. పాదయాత్ర తర్వాత అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఓటమి గుణపాఠం నేర్పుతుంది అనే విషయం నారా లోకేష్ విషయంలో సరిగ్గా సరిపోతుంది. 2014లో పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు సైలెంట్‌గా మంత్రి పదవి దక్కించుకున్నారు లోకేష్. వాస్తవానికి అప్పటి వరకు లోకేష్‌కు పదవి వస్తుందని ఎవరూ ఊహించలేదు. కీలకమైన ఐటీ, గ్రామీణాభివృద్ధి శాఖలకు మంత్రిగా వ్యవహరించారు లోకేష్. ఆ రెండు శాఖలను సమర్థంగా నిర్వహించిన లోకేష్.. ఏపీలో ఐటీ శాఖ అభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు కూడా పెద్ద పీట వేశారు. దీంతో మంత్రిగా నారా లోకేష్‌కు మంచి మార్కులే వచ్చాయి.

Also Read : ఆ విషయంలో జగన్ స్టాండ్ క్లియర్..!

ఎవరూ ఊహించని విధంగా నారా లోకేష్‌ను మంత్రిని చేసిన చంద్రబాబు… ఆ తర్వాత ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు. దీంతో వైసీపీ నేతలంతా లోకేష్‌పై విమర్శలు చేశారు. దొడ్డి దారిలో మంత్రి అయ్యారంటూ ఎద్దేవా చేశారు. అయినా సరే.. ఐదేళ్ల టీడీపీ ప్రభుత్వ పాలనలో మంత్రిగా నారా లోకేష్‌కు మంచి మార్కులే వచ్చాయి. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో తొలిసారి మంగళగిరి నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో దిగారు నారా లోకేష్. అయితే కేవలం ఒక్కసారి మాత్రమే టీడీపీ గెలిచిన నియోజకవర్గం కావడం.. పైగా జగన్ హవా కారణంగా ఆ ఎన్నికల్లో నారా లోకేష్ ఓడిపోయారు. అయినా సరే.. ఐదేళ్ల పాటు మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉన్నారు. అలాగే మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం ప్రత్యేక కార్యాలయం కూడా ఏర్పాటు చేశారు లోకేష్.

Also Read : మోడీకి మేమున్నాం.. అమెరికా ఆసక్తికర కామెంట్స్

ఓడినప్పటికీ, ఎన్ని నిందలు మోసినప్పటికీ.. సైలెంట్‌గానే ఉన్న నారా లోకేష్.. టార్గెట్ వైసీపీ అన్నట్లుగా అడుగులు వేశారు. 2023 జనవరి 25న యువగళం పాదయాత్ర ప్రారంభించారు. ఆ తర్వాత నుంచి నారా లోకేష్ హావభావాలు పూర్తిగా మారిపోయాయి. అలాగే మాట తీరు, వ్యవహార శైలి కూడా. ఇక పాదయాత్ర ప్రారంభం అయిన తర్వాత ఎక్కడికక్కడ వైసీపీ నేతలకు లోకేష్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. నాటి వైసీపీ పెద్దలతో పాటు అధికారుల్లో కూడా రెడ్ బుక్ అంటే భయం పట్టుకునేలా లోకేష్ ఆరోపణలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసిన నారా లోకేష్.. పార్టీ ఘన విజయంలో కీలక పాత్ర పోషించారు. ఎక్కడైతే ఓడిపోయి.. మాటలు అనిపించుకున్న మంగళగిరి నియోజకవర్గం నుంచే.. 2024 ఎన్నికల్లో పోటీ చేసిన లోకేష్.. ఏకంగా 90 వేల ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఆ తర్వాత మరోసారి ప్రభుత్వంలో మంత్రి పదవి చేపట్టారు లోకేష్.

Also Read : షర్మిలకు ఉన్న ధైర్యం జగన్ కు లేదా..?

విద్యా, ఐటీ శాఖ మంత్రిగా తనదైన శైలిలో దూసుకెళ్తున్న నారా లోకేష్‌కు త్వరలోనే డిప్యూటీ సీఎం పదవి వస్తుందని అంతా భావిస్తున్నారు. వాస్తవానికి ఈ ప్రతిపాదనను తెలుగుదేశం పార్టీ నేతలు నేరుగా సీఎం చంద్రబాబు ఎదుటే చేశారు. దానిని చంద్రబాబు ఎక్కడా ఖండించలేదు. దీంతో పలు సందర్భాల్లో లోకేష్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాడని డిమాండ్ కూడా చేశారు. అయితే ఈ విషయంపై ఎక్కడా ఎలాంటి వ్యాఖ్యలు చేయని చంద్రబాబు.. ఇప్పుడు మాత్రం దీనిపై క్లారిటీ ఇచ్చేసినట్లు తెలుస్తోంది. అమరావతి పునఃప్రారంభోత్సవం సందర్భంగా పత్రికలకు ఇచ్చిన ప్రకటనల్లో కేవలం నలుగురి ఫోటోలు మాత్రమే ముద్రించారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో పాటు మంత్రి నారా లోకేష్ ఫోటో కూడా ప్రచురించారు. వాస్తవానికి ఈ వేడుక మునిసిపల్ శాఖ పరిధిలో జరుగుతుంది. కానీ ప్రకటనల్లో ఎక్కడా మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ ఫోటో లేదు. కానీ.. డిప్యూటీ సీఎం పవన్ ఫోటో పక్కనే లోకేష్ ఫోటో ముద్రించారు. ఈ ప్రకటన చూసిన తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు.. ఇప్పుడు సంబరాలు జరుపుకుంటున్నారు. త్వరలో లోకేష్ కూడా డిప్యూటీ సీఎం అవుతారంటున్నారు. మరి అభిమానుల కోరిక తీరుతుందా లేదా తెలియాలంటే.. కొద్దిరోజులు ఆగాల్సిందే.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్