సింహాద్రి అప్పన్న సన్నిధిలో ఏం జరుగుతోంది.. అప్పన్నను దర్శించుకోవాలంటే ఏం చేయాలి.. చందనోత్సవం రోజున జరిగిన ప్రమాదానికి అసలు కారకులు ఎవరు.. ఇప్పుడు ఇవే ప్రతి ఒక్కరి మదిలో ఉన్న ప్రశ్నలు. ముందుగా ప్రతి ఒక్కరు ప్రభుత్వానిదే తప్పు అని ఓ రాయి వేసేస్తున్నారు. దీని వల్ల అసలు దొంగలు తప్పించుకుంటున్నారనే విషయం ఎవరూ గుర్తించటం లేదు. సింహాద్రి అప్పన్న సన్నిధిలో ప్రతి చిన్న విషయానికి ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దలదే తప్పు అన్నట్లుగా చూపిస్తున్నారు. కానీ వాస్తవానికి అసలు తప్పు ఎవరి వల్ల అంటే ఒకటే సమాధానం… అన్ని వేళ్లు ఒకవైపే చూపిస్తున్నాయి. అదే అప్పన్న ఆలయంలో ఉద్యోగులు.
Also Read : ఇంగ్లీష్ టూర్‌కు ఆ ముగ్గురూ ఫిక్స్..?
అప్పన్న ఆలయం పేరుకే దేవాదాయ, ధర్మాదాయ శాఖ పరిధిలో ఉంది. కానీ పెత్తనం మాత్రం అక్కడ ఏళ్ల తరబడి పనిచేస్తున్న ఉద్యోగులదే. నిబంధనలకు విరుద్ధంగా కొంతమంది ఉద్యోగులు ఏళ్ల తరబడి అక్కడే పని చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే.. ఆలయంలో ఓ మూల శిలేసుకుపోయారు. ఆలయానికి ఎంత మంది ఈవోలు వచ్చినా.. ఉన్నతాధికారులు మారినా సరే.. పెత్తనం మాత్రం చిరుద్యోగులదే. వాస్తవానికి వారంతే పేరుకే చిరు ఉద్యోగులు. కానీ అక్కడ పెత్తనం మాత్రం వారిదే. ఈవోలు వస్తుంటారు.. పోతుంటారు.. కానీ ఉద్యోగులు మాత్రం లోకల్ అనే మాట బాగా వినిపిస్తోంది.
Also Read : జగన్ మాస్టర్ ప్లాన్ రెడీ.. బీ అలర్ట్..!
వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయంలో అప్పనకు క్రతువులు నిత్యం జరుగుతూ ఉంటాయి. వీటి కోసం ప్రత్యేక అర్చక వ్యవస్థ ఉంది. కానీ ఆ అర్చకులపై కూడా చిరుద్యోగులదే పెత్తనం. ఆలయంలో ఏం కావాలన్నా సరే.. కాసులుంటే చాలు.. ఏ పనైనా జరిగిపోతుంది. పైసా మే పరమాత్మ అన్నట్లుగా డబ్బుంటే అప్పన్న దర్శనం జరుగుతుంది. ఆలయం గేటు బయట ఉండి… అక్కడే ఉన్న ఉద్యోగికి హాయ్ చెబితే చాలు.. ఎంత మంది ఉన్నా సరే.. వారికి వీఐపీ దర్శనం. ఆలయంలో ప్రత్యేక మర్యాదలు జరిగిపోతాయి. ఎలా అంటే.. అదంతే.
Also Read : మరో నోటు మాయమైతుందా..?
చందనోత్సవం రోజున గతంలో ఎప్పుడూ లేనట్లుగా గోడ కూలి 8 మంది మృతి చెందారు. ఈ ప్రమాదానికి అంతా ప్రభుత్వానిది, ఉన్నతాధికారులది తప్పు అంటున్నారు. కానీ వాస్తవానికి పై అధికారులు 2 నెలల ముందే ఏ పని చేయాలి.. ఎలా చేయాలి.. ఎప్పటి లోపు చేయాలి అని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కానీ కాసుల కోసం కక్కుర్తి పడిన ఉద్యోగులు.. నాణ్యత ప్రమాణాలకు తిలోదకాలిచ్చారు. అరకొర పనులను హడావుడిగా పూర్తి చేశారు. అసలు ఆ పనులు ఎలా జరుగుతున్నాయో కూడా పర్యవేక్షించలేదు. చివరికి ఆ పనులు ఎలా ఉన్నాయో కూడా కనీసం పరిశీలించకుండా క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికేట్ జారీ చేశారు. దీని వల్ల 8 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఇంత ఘోర ప్రమాదం జరిగినా సరే.. మాకేం సంబంధం లేదు అన్నట్లుగా ఉద్యోగులు మాత్రం సైలెంట్‌గా తేలు కుట్టిన దొంగల్లా పారిపోయారు. ఈ ఘటనపై లోతైన దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించింది. ఈ విచారణలో అయినా సరే.. ఉద్యోగుల నిజ స్వరూపం బయటకు వస్తే బాగుండు అని అంతా భావిస్తున్నారు.
Also Read : ఇంకెన్నాళ్లు ఈ సాగదీత..? టీటీడీపీ భవిష్యత్తు ఏంటీ..?
సింహాచలం ఆలయంలో దర్శన సమయాలు నిర్దేశిత విధంగా ఏ రోజూ పాటించలేదు. ఉదయం 6:30 నుండి రాత్రి 9 గంటల వరకు సర్వ దర్శనం, సుప్రభాతం, కల్యాణం వంటి సేవలు అందుబాటులో ఉన్నాయి. పండుగ రోజులు, సెలవు రోజుల్లో భక్తుల రద్దీ విపరీతంగా పెరుగుతుంది. దీని వల్ల గంటల తరబడి క్యూలైన్‌లో వేచి ఉండవలసి వస్తోంది. రూ.25, రూ.100కు స్పెషల్ దర్శన టికెట్లు అందుబాటులో ఉన్నప్పటికీ కౌంటర్ల వద్ద సరైన సమాచారం ఇచ్చే నాధుడే కరువు. ఏమైనా అంటే.. సరిపడినంత మంది సిబ్బంది లేరండి అనే సమాధానం వస్తుంది. దర్శన సమయంలో భక్తులతో సిబ్బంది అమర్యాదగా ప్రవర్తిస్తున్నారని, పరుషంగా మాట్లాడుతున్నారని గతంలోనే పలువురు భక్తులు ఫిర్యాదులు కూడా చేశారు. ఇక భక్తులకు అందించే ప్రసాదం నాణ్యత పై కూడా ఎన్నో ఫిర్యాదులు. ఎందుకిలా అని ప్రశ్నిస్తే… వంట సిబ్బంది నుంచి చీత్కారాలు. వంటశాల నిర్వహణపై కూడా సిబ్బందిని ఉన్నతాధికారులు గతంలో ఎన్నోసార్లు హెచ్చరించారు కూడా. కానీ సిబ్బంది తీరులో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. భక్తుల రద్దీకి అనుగుణంగా కాకుండా.. వారికి నచ్చినట్లుగా ప్రసాదాలు, అన్న ప్రసాదం తయారు చేయడం పరిపాటిగా మారిపోయింది.
Also Read : దేవినేని ఇంట పెళ్ళిపై గులాబీ పార్టీ సామాజిక వర్గ కక్ష
ఏదైనా జరిగినప్పుడు మాత్రం ప్రభుత్వ పెద్దలు హడావుడి చేస్తున్నారు. ఉన్నతాధికారుల్లో ఒకరిద్దరిపై బదిలీ వేటు పడుతుంది. అంతే తప్ప.. నిర్లక్ష్యానికి కారణమైన కిందిస్థాయి సిబ్బందిపై మాత్రం ఈగ కూడా వాలటం లేదు. ఆ రెండు రోజుల హడావుడి తప్ప.. తర్వాత దాని గురించి పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు. ఇప్పటికైనా ప్రభుత్వం సమస్య మూలాల్లోకి వెళ్లి… ఏళ్ల తరబడి ఇక్కడే పాతుకుపోయిన సిబ్బందిని తక్షణమే బదిలీ చేయాలని.. అలాగే దుర్ఘటనకు బాధ్యులైన వారిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.