Saturday, September 13, 2025 01:09 AM
Saturday, September 13, 2025 01:09 AM
roots

సింహాచలంలో ఘోర ప్రమాదం..!

విశాఖ జిల్లా సింహాచలంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. చందనోత్సవ వేళ గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందారు. ఏడాదికోసారి స్వామి వారి నిజరూప దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు పెద్ద ఎత్తున సింహాద్రి అప్పన్నను దర్శించుకుంటారు. ఇందుకోసం ముందు రోజు నుంచే భక్తులు క్యూ లైన్‌లో వేచి ఉంటారు కూడా. అక్షయ తృతీయ రోజు తెల్లవారు జామున స్వామి వారి నిజరూపాన్ని ముందుగా ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి వంశీయులు దర్శించుకుంటారు. ఇందులో భాగంగా ముందుగా కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు కుటుంబసభ్యులు స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. ఆ తర్వాత ప్రభుత్వం తరఫున మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, అనగాని సత్యప్రసాద్‌లు స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత బోర్డు ఛైర్మన్ బీఆర్ నాయుడు కూడా అప్పన్నకు పట్టువస్త్రాలు సమర్పించారు.

Also Read : బాబును తిడితేనే పెద్ద పదవులు..!

ఆ తర్వాత రూ.300 క్యూ లైన్‌లో వేచి ఉన్న భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతించారు. దీంతో ముందు రోజు నుంచే వేచి ఉన్న భక్తులు ఒక్కసారిగా దూసుకెళ్లడంతో తోపులాట చోటు చేసుకుంది. అయితే ముందు రోజు నుంచే సింహాచలం పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీని వల్ల పరిసర ప్రాంతాలన్నీ పూర్తి జలమయం అయ్యాయి. అటు క్యూ లైన్ పక్కనే కొత్తగా నిర్మించిన గోడ ఉంది. భక్తుల తోపులాటతో గోడ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఘటనాస్థలిలోనే ఏడుగురు మృతి చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో క్యూ లైన్ ఉన్న భక్తులు పరుగులు పెట్టడం వల్ల కూడా తొక్కిసలాట చోటు చేసుకుంది. దీంతో భక్తుల హాహా కారాలతో ఆ ప్రాంతమంతా భయానకంగా మారిపోయింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బంది.. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. గోడ కూలిన ప్రాంతంలో సహాయక చర్యలను ముమ్మరం చేశారు.

Also Read : మీ మంత్రే చెప్పాడు.. పాక్ పరువు తీసిన భారత్

సింహాద్రి అప్పన్న సన్నిధిలో ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భాంత్రి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదం జరిగిన తీరుపై జిల్లా కలెక్టర్, ఎస్పీతో మాట్లాడారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని హోమ్ మంత్రి వంగలపూడి అనిత పరిశీలించారు. సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించారు. ఘటనపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. భారీ వర్షం కారణంగా రెండు రోజులు క్రితమే కట్టిన గోడ పూర్తిగా నానిపోయి ఉందని.. దీనిపై భక్తులు ఎక్కడం వల్ల గోడ కూలినట్లు అధికారులు భావిస్తున్నారు. గాలి దూమారం కారణంగానే గోడ కూలిందని.. గోడ నాణ్యతపై కూడా విచారణ జరిపిస్తామని హోమ్ మంత్రి అనిత వెల్లడించారు. ఇదే సమయంలో మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇవ్వాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. ఇది ప్రభుత్వ వైఫల్యం అని ఆరోపించారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి ప్రమాదం జరగలేదని.. ఇది కూటమి ప్రభుత్వ వైఫల్యమని వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ఆరోపించారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్