Friday, September 12, 2025 07:23 PM
Friday, September 12, 2025 07:23 PM
roots

బూమ్రా ప్రవర్తనపై అభిమానులు ఫైర్.. కాస్త తగ్గు..!

టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రిత్ బూమ్రా.. వ్యవహార శైలిపై ఇప్పుడు అభిమానులు సోషల్ మీడియాలో అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్ లో అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్ గా మన్ననలను అందుకుంటున్న బూమ్రా.. ప్రవర్తన విషయంలో మాత్రం రోజురోజుకి దారుణంగా మారుతున్నాడు అనేది అభిమానుల కామెంట్. సాధారణంగా సైలెంట్ గా ఉండే ఈ ఫాస్ట్ బౌలర్.. ఈ మధ్య మాత్రం తన వ్యవహార శైలిలో మార్పు చూపిస్తున్నాడు. ఆస్ట్రేలియా పర్యటన తర్వాత అతని వైఖరిలో స్పష్టమైన మార్పు కనపడుతుంది.

Also Read : బ్యాంక్ ఖాతాలపై సంచలన నిర్ణయం

ఆస్ట్రేలియా సిరీస్ లో ఎవరు ఊహించని రేంజ్ లో అదిరిపోయే ప్రదర్శన చేసిన ఈ వరల్డ్ నెంబర్ వన్ బౌలర్.. ఐపీఎల్ సీజన్లో తోటి ఆటగాళ్లతో దూకుడుగా ప్రవర్తిస్తున్నాడు. బంతులు విసిరే సమయంలో కూడా ఆటగాళ్లను గాయపరిచే విధంగా బౌలింగ్ ఉంటుంది. తాజాగా లక్నో తో జరిగిన మ్యాచ్ లో.. బూమ్రా మొదటి ఓవర్ బౌలింగ్ చూస్తే అతని బాడీ లాంగ్వేజ్ పై సోషల్ మీడియాలో తీవ్ర కామెంట్స్ వచ్చాయి. సాధారణంగా ఇటువంటి ప్రవర్తన ఆస్ట్రేలియా ఆటగాళ్లు చూపిస్తూ ఉంటారు. బూమ్రా లాంటి మేటి ఆటగాడు అలా ప్రవర్తిస్తాడని కూడా ఎవరు ఊహించి ఉండరు.

Also Read : రాహుల్ – కోహ్లీ మధ్య వార్.. సోషల్ మీడియా ఓవరాక్షన్

బ్యాట్స్మెన్ కు బౌలర్ విసిరిన బంతి తగిలితే సారీ చెప్పడం లేదంటే అక్కడికెళ్ళి సరదాగా నవ్వుతూ మాట్లాడటం ఏదో ఒకటి చేస్తారు. కానీ ఇతను మాత్రం రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించడం.. ఇతర ఆటగాళ్లు అతనితో నవ్వే ప్రయత్నం చేస్తున్న సీరియస్ గా ఉంటూ.. ఆటిట్యూడ్ చూపించే ప్రయత్నం చేయడం అభిమానులకు నచ్చడం లేదు. ఇటీవల కూడా కరుణ్ నాయర్ తో ఇలాగే గొడవపడే ప్రయత్నం చేశాడు. కరుణ్ నాయర్ పొరపాటున.. బూమ్రాకి తగిలితే మైదానంలోనే చిన్న వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ తర్వాత ఎంపైర్లు వచ్చి గొడవను ఆపారు. బూమ్రా సక్సెస్ ను చూసి కాస్త రెచ్చిపోతున్నాడని.. అది కరెక్ట్ కాదంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇంకా అతనికి మూడు నుంచి నాలుగు ఏళ్ల పాటు కెరీర్ ఉందని కాబట్టి జాగ్రత్తగా ఉంటే.. నెగిటివిటీ రాకుండా కెరీర్ కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్