Saturday, September 13, 2025 01:23 AM
Saturday, September 13, 2025 01:23 AM
roots

అవును చెత్త పనులు చేస్తున్నాం: పాక్ సంచలన వ్యాఖ్యలు

జమ్ము కాశ్మీర్ ఉగ్రదాడి తర్వాత రెండు దేశాల మధ్య పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయి. భారత్ విషయంలో పాకిస్థాన్ అవలంబిస్తున్న వైఖరిపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. భారత్ ను తక్కువ అంచనా వేసిన పాకిస్తాన్ ఉగ్రవాదులను ఉసిగొల్పుతూనే ఉంది. దేశంలో ఉగ్రదాడులకు పాకిస్తాన్ కేంద్రంగా ప్రణాళికలు రచిస్తూనే ఉన్నారు. ఎన్నిసార్లు భారత్ నుంచి హెచ్చరికలు వెళ్లిన ఇతర దేశాల నుంచి వార్నింగ్ వచ్చిన పాకిస్తాన్ వైఖరిలో మాత్రం మార్పు లేదు.

Also Read : నీళ్ళు ఆపితే యుద్ధానికి సిద్ధమంటున్న పాక్.. సైన్యానికి సెలవులు రద్దు

తాజాగా జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి మరోసారి పాకిస్తాన్ నైజం ఏంటో ప్రపంచానికి చాటి చెప్పింది. పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. పాకిస్తాన్ పదేపదే ఈ తరహా దాడులకు పాల్పడటం.. సరిహద్దుల్లో తమ సైన్యంలో ఉగ్రవాదులను పంపించడం వంటివి పాకిస్తాన్ చేస్తోంది. తాజాగా దీనిపై ఆ దేశ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి కవాజా.. అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

Also Read : బెజవాడలో ఉగ్ర కదలికలు.. దక్షిణాదిపై ఫోకస్..?

పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషించిన మాట వాస్తవమేనని ఆయన స్పష్టం చేశారు. అమెరికా కోసమే తాము ఉగ్రవాదులను పెంచి పోషించినట్లు పేర్కొన్నారు. అమెరికా బ్రిటన్ సహా పశ్చిమ దేశాల కోసమే చెత్త పనులు చేస్తున్నామని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడు దశాబ్దాలుగా పశ్చిమ దేశాల కోసం చెత్త పనులు చేస్తున్నామని అంగీకరించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం పొరబాటని అర్థమైందని.. ఉగ్రవాదం వల్ల పాక్ చాలా ఇబ్బందులు పడిందని భవిష్యత్తులో కూడా పడటం ఖాయమని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్