Friday, September 12, 2025 11:10 PM
Friday, September 12, 2025 11:10 PM
roots

నీళ్ళు ఆపితే యుద్ధానికి సిద్ధమంటున్న పాక్.. సైన్యానికి సెలవులు రద్దు

జమ్మూ అండ్ కాశ్మీర్ లోని పెహల్గాం లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయాల నేపథ్యంలో పాకిస్తాన్ కూడా అదే రేంజిలో సమాధానం ఇచ్చే ప్రయత్నాలు చేస్తోంది. దీనితో రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం ముదిరే సంకేతాలు కనబడుతున్నాయి. జమ్మూ కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు చేసిన తర్వాత జరిగిన అతిపెద్ద ఉగ్రదాడి ఇదే. దీనితో భారత ప్రభుత్వం పాకిస్తాన్ విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది. సింధూ నది జలాలను పాకిస్థాన్లోకి వెళ్లకుండా ఒప్పందాన్ని రద్దు చేసింది.

Also Read : నీటి నుంచి క్రికెట్ వరకు.. పాకిస్తాన్ కు మోడీ షాక్

దీనితో పాకిస్తాన్ కూడా భారత్ కు దీటుగా సమాధానం ఇచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టింది. సింధూ నది జలాలను అడ్డుకోవడం యుద్ధమేనని పాకిస్తాన్ ఆరోపిస్తోంది. తమ దేశ ఆర్థిక వ్యవస్థపై ఆ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపిస్తుందని పాకిస్తాన్ నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక భారత్ తో తెగ తెంపులు చేసుకోవడానికి కూడా పాకిస్తాన్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య గగనతలాన్ని పాకిస్తాన్ మూసేసింది. ఇక తమ దేశంలో ఉన్న భారతీయులు ఉన్నపలంగా దేశాన్ని ఖాళీ చేసి వెళ్లాలని స్పష్టం చేసింది.

Also Read : బ్రేకింగ్: కొత్త పెన్షన్లకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

భారత్ తో అన్ని వ్యాపార సంబంధాలను రద్దు చేసుకోవాలని నిర్ణయించింది. ఇక సైన్యానికి సెలవులు కూడా రద్దు చేస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సెలవులో ఉన్న సైనిక్ అధికారులు తిరిగి విధుల్లో చేరాలని స్పష్టం చేసింది. పాక్ సైన్యంతో పాటుగా ఆ దేశ ప్రజలు కూడా దేనికైనా సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది. ఇక భారత జవాన్ ను పాకిస్తాన్ బందీగా పట్టుకుంది. తమ దేశంలోకి ప్రవేశించాడనే కారణంతో బిఎస్ఎఫ్ జవాన్ ను అదుపులోకి తీసుకుంది. ఈ వ్యవహారంపై భారత రక్షణ శాఖ సీరియస్ అయింది. అక్రమంగా బంధించారని వెంటనే విడుదల చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్