భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) 2024-25 సీజన్ లో వార్షిక కాంట్రాక్టులను ప్రకటించింది. 2023-24 జాబితాలో చోటు దక్కించుకోని శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ తిరిగి సెంట్రల్ కాంట్రాక్ట్ లో అడుగు పెట్టారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా మాత్రమే A+ కేటగిరీలో చోటు దక్కించుకున్నారు. రజత్ పాటిదార్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా వంటి యువ క్రికెటర్లకు తొలి కాంట్రాక్టులు లభించాయి. ఇక రిషబ్ పంత్, సిరాజ్ ఏ కాంట్రాక్ట్ లో చోటు దక్కించుకున్నారు.
Also Read : అందుబాటులోకి వస్తున్న అన్న.. ప్యాలెస్ లో సందడి వాతావరణం
సెంట్రల్ కాంట్రాక్టులను 4 కేటగిరీలుగా విభజించారు. A+, A, B, C — ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా అలాగే, మూడు ఫార్మాట్లలో పాల్గొనడాన్ని బట్టి ఈ కాంట్రాక్ట్ లో చోటు కల్పించారు. రోహిత్, కోహ్లీ, జడేజా గత ఏడాది అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. గత ఏడాది కాంట్రాక్ట్ లో కొన్ని క్రమశిక్షణా ఉల్లంఘనల కారణంగా ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ ద్వయాన్ని కేంద్ర కాంట్రాక్టు నుండి తొలగించారు. అయ్యర్ ఇప్పటికే వన్డే ఫార్మాట్ లో జాతీయ జట్టులోకి అడుగు పెట్టాడు. ప్రస్తుత ఐపిఎల్ సీజన్ లో ఇషాన్ కిషన్ మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు. కాగా అయ్యర్ ను గ్రేడ్ బీలో చేర్చారు.
Also Read : గంభీర్ కు షాక్ ఇచ్చిన బోర్డు
గ్రేడ్ A+
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, “గ్రేడ్ ఎ” ఎండీ సిరాజ్, కెఎల్ రాహుల్, శుభ్‌మాన్ గిల్, హార్దిక్ పాండ్యా, ఎండీ షమీ, రిషబ్ పంత్, గ్రేడ్ బి” సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్, గ్రేడ్ సి”, రింకు సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శివం దుబే, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, సంజు సామ్సన్, అర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, రజత్ పాటిదార్, ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, ఆకాష్ దీప్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణాలు సెంట్రల్ కాంట్రాక్ట్ లో చోటు దక్కించుకున్నారు.
జీతాల విషయానికి వస్తే:
గ్రేడ్ A+: సంవత్సరానికి రూ.7 కోట్లు
గ్రేడ్ A: సంవత్సరానికి రూ.5 కోట్లు
గ్రేడ్ B: సంవత్సరానికి రూ.3 కోట్లు
గ్రేడ్ C: సంవత్సరానికి రూ.1 కోటి