కడుపు మండిన వాడి మాటలకు సమాజంలో విలువ ఎక్కువ.. ఈ మాట ఖచ్చితంగా వైసీపీ మాజీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డికి నప్పుతుంది. వైసిపి ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి దర్శకత్వం వహించి, నిర్మాతగా వ్యవహరించి, స్క్రీన్ ప్లే రాసి, నటులను కూడా ఎంపిక చేసిన ఘనత విజయసాయిరెడ్డి కే సొంతం. అలాంటి విజయసాయిరెడ్డి ఇప్పుడు సైడ్ క్యారెక్టర్ అయిపోయారు. వైసీపీ ఆవిర్భావం తర్వాత.. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే వరకు అన్ని విషయాల్లో విజయసాయిరెడ్డి ది కీలక పాత్ర. అలాంటి విజయసాయి రెడ్డికి ఇప్పుడు కడుపు మండుతుంది.
Also Read : ప్రభుత్వంలో వైసీపీ కోవర్టులు.. బయటకు వస్తారా..?
తాను కర్త కర్మ క్రియ వ్యవహరించిన పార్టీలో కోటరీ డామినేషన్ తట్టుకోలేకపోతున్న విజయసాయిరెడ్డి బయటపెడుతున్న కొన్ని విషయాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. వైసీపీలో విజయసాయిరెడ్డి డామినేషన్ అనే విషయం అందరికీ క్లారిటీ ఉంది. ఆ డామినేషన్ తగ్గిన తర్వాతే జగన్ గ్రాఫ్ కూడా పడిపోతూ వచ్చింది అనే అభిప్రాయం కూడా చాలా మందిలో ఉంది. ఇక తాజాగా ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. రాజకీయ వర్గాల్లో కంటే కూడా వైసీపీలో.. అలాగే జగన్ ఎక్కువగా అభిమానించే వారిలో విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు లేనిపోని అనుమానాలకు తెరతీసాయి.
Also Read : జగన్‌కు ఈడీ బిగ్ షాక్..!
వైసీపీ అగ్ర నేతలకు విజయసాయిరెడ్డి దమ్మెంతో క్లారిటీ ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుంచి ప్రతి ఒక్కరిని జగన్ కు దగ్గర చేయడంలో విజయసాయిరెడ్డి అన్ని విషయాల్లో సఫలీకృతం అయ్యారు. ఇక తాజాగా తాను పార్టీని అన్ని విషయాల్లో వంటి చేత్తో నడిపించాను అంటూ చేసిన ఓ కామెంట్.. జగన్ పరువు తీసింది అనేది చాలామంది రాజకీయ పరిశీలకులు మాట్లాడే మాట. సాధారణంగా రాజకీయాల్లో వాక్చాతుర్యం ఉన్నవాళ్లు మీడియాలో అలాగే ప్రజల్లో ఎక్కువగా కనబడుతూ ఉంటారు.
Also Read : జనసేనలోకి వైసీపీ మాజీ మంత్రి..!
వ్యూహాలు రచించేవారు మాత్రం వెనకే ఉంటారు. వారిని ముందుండి నడిపించేది మాత్రం రాజకీయ దర్శకులే. విజయసాయిరెడ్డి దూరమైన తర్వాత జగన్ ను డైరెక్ట్ చేస్తున్న వాళ్ళు ఆయన పరువు తీసే విధంగానే ప్రవర్తిస్తున్నారు అనేది ఇప్పుడిప్పుడు క్లారిటీ వస్తుంది. వైసీపీని అధికారంలోకి తీసుకురావడానికి జగన్ ఆహార్యాన్ని కూడా విజయసాయిరెడ్డి మార్చేశారు. జగన్ బట్టల నుంచి మాట తీరు వరకు ప్రతి ఒక్కటి విజయసాయిరెడ్డి డైరెక్షన్లోనే మారాయి. గళ్ళ చొక్కాలు వేసే జగన్ కాకి ప్యాంటు తెల్లచొక్కా వేసే వరకు విజయసాయిరెడ్డి తీసుకొచ్చారు. ఈ విషయంపై క్లారిటీ ఉన్న చాలా మంది వైసిపి కీలక నేతలు, జగన్ భక్తులు.. విజయసాయిరెడ్డిని వెనక జగన్ దగ్గర చేసుకోకపోతే మాత్రం పరిస్థితి రోజురోజుకీ దారుణంగా మారే అవకాశాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు.




