Friday, September 12, 2025 09:24 PM
Friday, September 12, 2025 09:24 PM
roots

టీ కాంగ్రెస్ లో ఎంపీ గారి డామినేషన్ వేరే లెవల్

సాధారణంగా ప్రభుత్వాలు అధికారంలో ఉన్న సమయంలో కొంతమంది పెత్తనం చెలాయించేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ ముఖ్యమంత్రి కి సన్నిహితంగా ఉన్నా మనో లేదంటే మంత్రులకు సన్నిహితంగా ఉంటామనో ఏదో ఒక రూపంలో.. హడావుడి కాస్త ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో ఓ ఎంపీ గారి హడావుడి ఇలాగే ఉంది. సదరు ఎంపీ గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంపీ సీట్ ఇప్పించారు. అదృష్టం బాగుండి 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన ఎంపీగా మంచి మెజారిటీతో విజయం సాధించారు.

Also Read : జగన్‌కు ఈడీ బిగ్ షాక్..!

తొలిసారి ఎంపీ అయినా సరే సదరు ఎంపీ గారికి హడావుడి ఎక్కువ. రేవంత్ రెడ్డి తో సన్నిహితంగా ఉంటాను అని చెప్పుకునే ప్రయత్నం చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా తన పెత్తనం చెలాయించేందుకు ఆయన ఎక్కువగా కష్టపడుతున్నారు. మంత్రి పదవులు విషయంలో కూడా సదరు ఎంపీ గారి దూకుడు ఎక్కువగా ఉంది. తెలంగాణలో ఖాళీగా ఉన్న మంత్రి పదవుల విషయంలో ఆయన కొంతమందికి స్వయంగా హామీలు ఇచ్చేస్తున్నారు. ఈ వ్యవహారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు వెళ్లి ఇటీవల ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం కూడా ఉంది.

Also Read : జనసేనలోకి వైసీపీ మాజీ మంత్రి..!

జిల్లాలో కాంగ్రెస్ నేతల డామినేషన్ ఎలా ఉన్నా ఎంపీ గారి హడావుడి మాత్రం వేరే లెవల్ లో ఉంటుంది. సచివాలయానికి కూడా స్వేచ్ఛగా వెళ్ళిపోయే ఎంపీ గారు పార్లమెంట్ సమావేశాల కంటే ఎక్కువగా అసెంబ్లీ సమావేశాలకే ప్రాధాన్యత ఇస్తూ ఉంటారట. ఇక కొంతమంది ఎమ్మెల్యేలతో కూడా నేరుగా మాట్లాడుతూ వారి ఆకాంక్షలు వింటూ వాటిని నెరవేర్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు సదరు ఎంపీ గారు. జిల్లాలో కాంగ్రెస్ అగ్ర నేతలు ఉన్నా సరే ఆయన డామినేషన్ మాత్రం వేరే లెవెల్ లో ఉంటుంది. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి, లేదంటే ఒకరిద్దరూ మంత్రుల ప్రాధాన్యత ఎక్కువ. తన మాటకు కూడా వెయిట్ ఎక్కువ అని నిరూపించుకునేందుకు ఎంపీ గారు తీవ్రంగా కష్టపడుతున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్