ఏపీలో పోలీస్ శాఖను తిరిగి గాడిలో పెట్టె దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. గత అయిదేళ్ళుగా పోలీస్ శాఖ తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. రాజకీయ నాయకులకు సహకరిస్తూ ప్రజలకు న్యాయం చేయడం లేదనే విమర్శలు ఎన్నో రకాలుగా వింటూ వచ్చాం. అయితే గత ఏడాది కాలంగా పోలీస్ శాఖలో కీలక మార్పులు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపధ్యంలో అత్యుత్తమ పోలీసింగ్ ప్రమాణాలలో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది ఏపీ పోలీస్.
Also Read : లిక్కర్ స్కాంలో కీలక పరిణామం
మొదటి స్థానంలో తెలంగాణ నిలిచింది. సెంటర్ ఫర్ సోషల్ జస్టిస్, కామన్ కాజ్, కామన్ వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనిషియేటివ్ సంస్థల సహకారంతో టాటా ట్రస్ట్ నివేదిక ఇచ్చింది. ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 పేరుతో టాటా ట్రస్ట్ విడుదల చేసిన నివేదికలో రెండో స్థానంలో ఉంది ఏపీ. 6.44 స్కోర్ తో దేశంలోనే ద్వితీయ స్థానంలో నిలిచారు ఏపీ పోలీసులు. కోటికంటే ఎక్కువ జనాభా ఉన్న 18 రాష్ట్రాలతో పోల్చి చూస్తే రెండో స్థానంలో నిలిచింది ఆంధ్రప్రదేశ్. ఏపీ పోలీస్ శాఖలో 33 శాతం మహిళలు పెరిగారు.
Also Read : అక్కడ రేవంత్ ఇక్కడ చంద్రబాబు.. ఎమ్మెల్యేలకో దండం
కేంద్ర పాలిత ప్రాంతాల్లో సైతం ఈ స్థాయిలో సేవలు అందటం లేదని ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 లో టాటా ట్రస్ట్ తెలిపింది. న్యాయం కోసం ఆశ్రయించే ప్రజలకు కోర్టులు, పోలీసు స్టేషన్లలో ప్రజలకు అత్యుత్తమ స్థాయిలో సేవలు అందించడంలో రెండో స్థానంలో నిలిచింది. 2019 నుంచి రాష్ట్రాలకు టాటా ట్రస్ట్ ర్యాంకింగ్ ఇస్తోంది. ప్రజలకు న్యాయం అందించే న్యాయ స్థానాలు,జైళ్లలో న్యాయ సహాయం అందించే విభాగాలపై అధ్యయనం చేస్తున్న టాటా ట్రస్ట్.. పలు కీలక అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది.