Saturday, September 13, 2025 12:43 AM
Saturday, September 13, 2025 12:43 AM
roots

సాయి సుదర్శన్ కు అదృష్టం కష్టమేనా..?

జాతీయ జట్టుకు ఆడాలి అంటే ఖచ్చితంగా అదృష్టం ఉండాలి. ప్రతిభ కంటే అదృష్టమే ఇక్కడ ఎక్కువ పాత్ర పోషిస్తుంది. కొంతమంది ఆటగాళ్లు అదృష్టం లేక అంతర్జాతీయ క్రికెట్లో అవకాశాలు రాక క్రికెట్ నుంచి తప్పుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆ జాబితాలో ఇప్పుడు సాయి సుదర్శన్ కూడా చేరే అవకాశం ఉందని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఎంతో ప్రతిభ ఉన్నా సరే ఇప్పటివరకు జాతీయ జట్టుకు అతను ఎంపిక కాలేకపోతున్నాడు. ఐపీఎల్ ను ప్రామాణికంగా తీసుకునే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు సాయి సుదర్శన్ విషయంలో మాత్రం అన్యాయం చేస్తుంది అనే ఆరోపణలు వినబడుతున్నాయి.

Also Read : స్టార్ హీరో కొడుకుతో ప్రేమలో అనుపమ

ఐపీఎల్ లో రాణించిన ఆటగాళ్లు చాలామంది జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, నితీష్ రెడ్డి, హర్షిత్ రానా.. ఇలా చాలామంది ఐపీఎల్లో సత్తా చాటి జాతీయ జట్టులో అడుగుపెట్టారు. అయితే ఐపీఎల్ లో అంచనాలకు మించి రాణిస్తున్న సాయి సుదర్శన్ మాత్రం ఇప్పటివరకు జాతీయ జట్టులో అడుగు పెట్టలేకపోయాడు. టెస్ట్ క్రికెట్లో కూడా సమర్థవంతమైన ఆటగాడిగా అతనికి పేరు ఉంది. ఆస్ట్రేలియా మైదానాల్లో కూడా స్వేచ్ఛగా పరుగులు చేసిన సాయి సుదర్శన్ జాతీయ జట్టులో అడుగు పెట్టేందుకు నానా కష్టాలు పడుతున్నాడు.

Also Read : ధోనీపై ఆగని తిట్ల వర్షం

ఇంగ్లాండ్లో కౌంటి మ్యాచులు కూడా ఆడిన సాయి సుదర్శన్ మిడిల్ ఆర్డర్లో అత్యంత కీలక ఆటగాడిగా మారే ప్రతిభ ఉంది. అవసరమైన సమయంలో దూకుడుగా బ్యాటింగ్ చేసే సత్తా కూడా అతని సొంతం. వికెట్లు పడుతున్న సమయంలో కూడా స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తూ పరుగులు రాబడుతూ ఉంటాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్లో అతను అత్యధిక పరుగుల జాబితాలో రెండవ స్థానంలో ఉన్నాడు. చాలామంది స్టార్ ఆటగాళ్ల కంటే అతను మెరుగైన ప్రదర్శన చేస్తున్న సరే అతనికి జట్టులో చోటు దక్కడం కష్టంగా మారిపోయింది. అభిషేక్ శర్మ పెద్దగా రాణించకపోయిన ఎప్పుడో ఒక ఇన్నింగ్స్ దూకుడుగా ఆడటంతో అతనికి జాతీయ జట్టులో చోటు దక్కింది. మరి సాయి సుదర్శన్ కు అవకాశం ఎప్పుడొస్తుందో చూడాలి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్