అనుపమ పరమేశ్వరన్ పరిచయం అవసరం లేని పేరు. హీరోయిన్ గా దక్షినాది సినీ పరిశ్రమలో ఓ వెలుగు వెలుగుతున్నారు. ప్రేమమ్ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం అయినటువంటి ఈమె.. అక్కడ నుంచి తెలుగు, తమిళ భాష సినిమాలలో అవకాశాలు అందుకుంటూ కెరియర్ పరంగా మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక కార్తికేయ 2 సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న అనుపమ పరమేశ్వరన్, ప్రస్తుతం మలయాల నటుడు విక్రమ్ కుమారుడు ధ్రువ్ విక్రమ్ తో కలిసి బైసన్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
Also Read : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పండగే
అయితే తాజాగా వీరిద్దరికి సంబంధించిన ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ ఫోటోలో భాగంగా వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారని, వీరిద్దరూ గాఢంగా ముద్దు పెట్టుకున్న ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అనుపమ పరమేశ్వరన్ డేటింగ్ రూమర్ల గురించి పెద్ద ఎత్తున వార్తలు కూడా మీడియాలో సందడి చేస్తున్నాయి. గత కొంతకాలంగా ఈమె ఒక స్టార్ హీరో కొడుకుతో డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ వార్తలకు ఈ ఫోటో మరింత బలం చేకూర్చింది.
Also Read : పోల్ : 2025 లో ఏ హీరో సినిమా కోసం మీరు ఎదురు చూస్తున్నారు?
ఇక ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారా అనే సందేహాలు వ్యక్తం అవుతుండగా.. మరికొందరు మాత్రం ఈ ఫోటో నిజం కాదని, ఇది కేవలం సినిమాలో ఓ సన్నివేశం లోనిది అంటూ సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మారి సెల్వరాజ్‌తో వారు చేస్తున్న సినిమా కోసం పీఆర్ టీమ్ చేసిన పనిగా భావిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈసినిమాకు సంబంధించిన ఓ ఫస్ట్ లుక్‌ను చిత్ర బృందం విడుదల చేశారు. ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లలో భాగంగా ఇలాంటి ఫోటోని రిలీజ్ చేసినట్టు తెలుస్తుంది.ప్రస్తుతం ఈ ఫోటో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.