జనవరిలో తిరుమలలో జరిగిన తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఈ ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం పై అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. భారీగా భక్తులు వస్తున్న సందర్భంలో కనీస జాగ్రత్తలు తీసుకోలేదని భద్రత చర్యలను చేపట్టలేదని విమర్శించాయి విపక్షాలు. ఈ విషయంలో వైసీపీ పెద్ద ఎత్తున రాజకీయం చేసే ప్రయత్నం చేసింది. ఈ ఘటన తర్వాత పలువురు పోలీస్ అధికారులతో పాటుగా టీటీడీ ఉద్యోగులపై కూడా చర్యలు తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ ఘటనలో ఏ విధమైన తప్పులేని తిరుపతి ఎస్పీపై కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
Also Read : ప్రవీణ్ కేసు క్లోజ్.. పోలీసులు ఏమన్నారంటే
ఇదిలా ఉంచితే తాజాగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన వెనుక కుట్రకోణం ఉండవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. తిరుపతి తొక్కిసలాట ఘటనకు ముఖ్య కారకుడు గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డి అని దీని వెనుక కుట్ర కోణం ఉండవచ్చని ఆయన పలు అనుమానాలు వ్యక్తం చేశారు. తిరుపతిలోని ఎస్వీ గోశాలలో ఆదివారం సందర్శించిన ఆయన అక్కడున్న గోవులను పరిశీలించారు. హరినాథ్ రెడ్డి అసలు హిందువు కాదని కుమార్తెకు ఏ సాంప్రదాయం ప్రకారం వివాహం చేశారో అందరికీ తెలుసని అన్నారు.
Also Read : వైసీపీ టాపిక్ డైవర్షన్ పాలిట్రిక్స్..!
గడువు ముగిసిన మందులు అలాగే పురుగులు పట్టిన దాణా ఇచ్చిన వ్యక్తి గోవుల గురించి మాట్లాడుతున్నారని.. కొన్ని సహజంగా మరికొన్ని అనారోగ్యంతో అలాగే వృద్ధాప్యంతో చనిపోవడం సాధారణమని అన్నారు. ఇందులో టీటీడీ అధికారుల తప్పేమీ లేదని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి వ్యక్తి భూమి పై పుట్టకూడదని స్వామివారిని కోరుకుంటున్నాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూమతస్తులపై పడటం కాదని వేరే మతాలపై పడితే అప్పుడు తెలుస్తుంది అన్నారు బిఆర్ నాయుడు. కరుణాకర్ రెడ్డి పై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని, ఎక్కడో చనిపోయిన గోవులను ఇక్కడ చనిపోయినట్లు చూపిస్తున్నారని మండిపడ్డారు.