Friday, September 12, 2025 10:56 PM
Friday, September 12, 2025 10:56 PM
roots

బ్రేకింగ్: గోరంట్ల వ్యవహారంలో పోలీసులకు బిగ్ షాక్

గత కొన్నాళ్లుగా మౌనంగా ఉన్న హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇప్పుడు మళ్లీ దూకుడు పెంచారు. ఆయన చేస్తున్న విమర్శలు.. మాట్లాడుతున్న మాటలు రాజకీయంగా వైసిపి నేతలకు కాస్త బూస్ట్ ఇస్తున్నాయి. ఇటీవల చేబ్రోలు కిరణ్ వ్యవహారంలో ఆయన చేసిన వ్యాఖ్యలు.. కిరణ్ ను అదుపులోకి తీసుకున్న సమయంలో ఆయన అనుసరించిన వ్యవహార శైలి.. ప్రతి ఒక్కటి ఆశ్చర్యం కలిగించింది. జగన్ కంట్లో పడాలని గోరంట్ల మాధవ్ పడిన తపన.. మీడియాలో చేసిన హడావుడి అన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read : బీజేపీతో డీల్ సెట్ చేసుకున్న సాయిరెడ్డి

ఇక చేబ్రోలు కిరణ్ పై హత్యాయత్నం జరిగిందని పోలీసులు గోరంట్ల మాధవ్ పై కేసు నమోదు చేశారు. దీనితో అతనికి కోర్టు 14 రోజుల రిమాండ్ కూడా విధించింది. ఇక తాజాగా గోరంట్ల మాధవ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను నివేదిక అడిగింది. కోర్టుకు హాజరు పరిచిన సమయంలో గోరంట్ల మాధవ్ సెల్ఫోన్ ఉపయోగించినట్లు గుర్తించారు. కోర్టులో అతను ఫోన్లో మాట్లాడినట్లు.. ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. దీనితో వ్యవహారంపై ప్రభుత్వ పెద్దలు పోలీస్ పెద్దలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

Also Read : ప్రవీణ్ కేసు క్లోజ్.. పోలీసులు ఏమన్నారంటే

గోరంట్ల మాధవ్ కు కోర్టులో ఫోన్ ఎవరిచ్చారు అనేదానిపై ప్రభుత్వ పెద్దలు ఆరా తీస్తున్నారు. దీనిపై ఇప్పటికే పోలీసులు విచారణ కూడా పూర్తి చేసినట్లు సమాచారం. కిరణ్ ఉన్న అడ్రస్ కొంతమంది పోలీస్ అధికారులు చెప్పారని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్ట సమయంలో కూడా గోరంట్ల మాధవ్ పోలీసులపై ఓవరాక్షన్ చేశారు. ఐదారుగురు పోలీస్ అధికారులపై వేటుపడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే పూర్త వివరాలతో పోలీసు ఉన్నతాధికారులు నివేదికను కూడా సిద్ధం చేశారు. ఒకటి రెండు రోజుల్లో పోలీసులు పై చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్