తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు కలవరం మొదలైంది. ఇందుకు పార్టీ అధినేత చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరే ప్రధాన కారణమని టీడీపీ నేతలు, కార్యకర్తలు వ్యాఖ్యానిస్తున్నారు కూడా. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రూల్స్ బ్రేక్ చేసిన వారిపై చంద్రబాబు చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. తన, మన అనే భేదం లేకుండా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే పలు ఉదాహరణలున్నాయి కూడా. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త కిరణ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కాకుండా.. కేసు పెట్టి అరెస్టు కూడా చేయించారు. ఇక ప్రభుత్వ అధికారులపై తీవ్ర విమర్శలు చేసిన టీడీపీ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి చేసిన రాజీనామాను ఆఘమేఘాల మీద ఆమోదించారు చంద్రబాబు. పార్టీ లైన్ దాటితే, రూల్స్ బ్రేక్ చేసిన వారిపై ఎలా వ్యవహరిస్తారమనే దానికి ఈ రెండు ఘటనలే ఉదాహరణ.
Also Read : పెద్ద ప్లాన్ తోనే గోరంట్ల మాధవ్..!
ఏపీలో స్థానిక సంస్థలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. లోకల్ బాడీ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది. వచ్చే ఏడాది మార్చి వరకు స్థానిక సంస్థలకు అవకాశం ఉంది. కానీ టీడీపీ శ్రేణుల్లో మాత్రం ఇప్పటి నుంచే భయం పట్టుకుంది. వాస్తవానికి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు చంద్రబాబు ఏ మాత్రం ఆసక్తి చూపించరు. గడువు ముగిసినా కూడా లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించేందుకు చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోరు. స్పెషల్ ఆఫీసర్ పాలనలోనే గడిపేస్తారు అనేది చంద్రబాబుపై ప్రధాన ఆరోపణ. లోకల్ ఎలక్షన్‌లకు ఇంకా ఏడాది గడువు ఉన్నప్పటికీ.. ఇప్పటి నుంచే ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ దఫా కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు చంద్రబాబు సర్కార్ ఈసీకి సహకరిస్తుందా అనే అనుమానం వ్యక్తం అవుతోంది.
Also Read : కేబినెట్ మౌనం ఎందుకు..? జగన్ కు ఛాన్స్ ఇస్తున్నారులే
స్థానిక సంస్థలకు ఎన్నికల నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సమావేశాలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది మార్చిలో ఎన్నికలుండే అవకాశం ఉంది. అప్పటికీ కూటమి సర్కార్ ఏర్పడి రెండేళ్లు అవుతుంది కూడా. అంటే ప్రభుత్వ పాలనపై ప్రజలు ఓ అవగాహనకు వస్తారనేది పార్టీ నేతల మాట. ఓ వైపు ప్రభుత్వంపై ఇప్పటికే కావాల్సినంత వ్యతిరేకత ఉందనేది వైసీపీ నేతల ఆరోపణ. అందుకే మొన్న జరిగిన ఎంపీపీ ఉప ఎన్నికల్లో వైసీపీ ఎక్కువ స్థానాలు గెలిచిందని ప్రచారం చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలంటే.. వాటి ఫలితాలు ఎలా ఉంటాయో టీడీపీ నేతలు ఇప్పటికే ఊహిస్తున్నారు కూడా. ఎమ్మెల్సీ సహా నామినేటెడ్ పదవుల కేటాయింపులో జనసేన, బీజేపీ నేతలకు పెద్ద పీట వేశారు చంద్రబాబు. స్థానిక సంస్థల్లో ఆయా పార్టీలు ఇదే స్థాయిలో డిమాండ్ చేసే అవకాశం ఉంది. అప్పుడు కిందిస్థాయి నేతల మధ్య విభేదాలు తప్పవు.
Also Read : 2025 లో ఏ హీరో సినిమా కోసం మీరు ఎదురు చూస్తున్నారు?
ఇక వైసీపీ పాలనలో పోలీసులు, అధికారుల సాయంతో టీడీపీ సభ్యులు నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకున్నారనేది అందరికీ తెలిసిన విషయమే. అలా చేయడం వల్లే వైసీపీపై ప్రజల్లో కావాల్సినంత వ్యతిరేకత వచ్చింది కూడా. ఇలాంటి చర్యలకు చంద్రబాబు పూర్తి వ్యతిరేకం. రూల్స్ ప్రకారం నడుచుకోవాలంటారు. వైసీపీ పాలనలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచే టీడీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేయడం, కేసులు పెట్టడం జరిగింది. దీంతో చాలా చోట్ల నామినేషన్ వేసేందుకు కూడా టీడీపీ నేతలు ముందుకు రాలేదు. మరి వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలను టీడీపీ ఎలా ఎదుర్కొంటుంది.. వైసీపీ నేతలను ఎలా అడ్డుకుంటుంది.. ప్రస్తుత ఏపీ ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటారా… లేదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.