కెఎల్ రాహుల్” ఏ ముహూర్తాన ఆస్ట్రేలియా టూర్ కోసం అడుగుపెట్టాడో గాని.. అక్కడి నుంచి మనాడి దశ తిరిగిపోయింది. సహచర ఆటగాళ్ళు ఆస్ట్రేలియా పేస్ బౌలింగ్ అటాక్ ను ఎదుర్కోవడానికి నానా ఇబ్బందులు పడుతుంటే.. రాహుల్ మాత్రం వందల బంతులను తన టెక్నిక్ తో అలవోకగా ఆడేసాడు. ఇక అక్కడి నుంచి రాహుల్ కెరీర్ మళ్ళీ ఊపు అందుకుంది. ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలో మనాడి ఆటకు అభిమానులు ఫిదా అయిపోయారు. ఏ స్థానంలో అయినా బ్యాటింగ్ చేయగలిగే సామర్ధ్యం ఉంది అని నిరూపించాడు రాహుల్.
Also Read : పోల్ : 2025 లో ఏ హీరో సినిమా కోసం మీరు ఎదురు చూస్తున్నారు?
కట్ చేస్తే.. ఆ మెగా టోర్నీలో హీరో రాహుల్. కీపర్ గా, బ్యాట్స్మెన్ గా అతను ఎంతో విలువైన ఆటగాడిగా కనిపించాడు. ఇప్పుడు ఐపిఎల్ వంతు వచ్చింది. అతను ఫాంలో లేని సమయంలో ఐపిఎల్ వేలం జరగగా.. అతని సామర్ధ్యానికి తగ్గ ధర రాలేదనే భావన చాలా మందిలో వినపడింది. కాని రాహుల్ మాత్రం ఐపిఎల్ లో దుమ్ము రేపుతున్నాడు. 92 సగటుతో మూడు మ్యాచుల్లో రెండు హాఫ్ సెంచరీలు సాధించాడు. బెంగళూరు జట్టుపై చేసిన 93 పరుగులు.. ఐపిఎల్ ది బెస్ట్ గా చెప్తున్నారు విశ్లేషకులు.
Also Read : కిరణ్ ఓకే.. మరి వాళ్ళను ఎందుకు వదిలేసినట్టు..?
58 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి.. పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఢిల్లీని తన మెరుపు బ్యాటింగ్ తో గెలిపించాడు. అయితే మ్యాచ్ గెలిచిన అనంతరం అతను చేసుకున్న సెలెబ్రేషన్ మాత్రం హాట్ టాపిక్ గా మారింది. నేను హీరో.. ఇది నా హోం గ్రౌండ్ అంటూ రాహుల్ మైదానంలో గర్జించాడు. అది చూసిన అభిమానులు.. రాహుల్ ఆర్సీబీ యాజమాన్యంతో పాటుగా, లక్నో యాజమాన్యానికి కూడా స్ట్రాంగ్ సిగ్నల్ ఇచ్చాడు అంటున్నారు. తాను ఆర్సీబీకి రావాలనుకున్నా సరే తనను కొనలేదని.. ఆ కోపం రాహుల్ లో ఉందంటున్నారు ఫ్యాన్స్. అందుకే తన సొంత మైదానంలో తాను ఏంటీ అనేది ప్రూవ్ చేసుకున్నాడు అంటున్నారు. ఇక చిన్నస్వామి మైదానంలో తనకు ఎదురులేదని.. అక్కడి పరిస్థితులు తనకు తెలిసినంత బాగా ఎవరికి తెలియవు అంటూ రాహుల్ కామెంట్ చేసాడు. ఈ కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి.




