మాజీ మంత్రి విడదల రజనీపై ఒక్కో కేసు బయటకు వస్తోంది. వైసీపీ హయాంలో అన్ని విధాలుగా రెచ్చిపోయిన రజనీ కి ఇప్పుడు షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని రైతులను, వ్యాపారులను బెదిరించిన విడదల రజనీపై ఇప్పుడు వరుసగా కేసులు నమోదు అవుతున్నాయి. యడ్లపాడుకు చెందిన ఒక స్టోన్ క్రషర్ యజమానిని ఆమె బెదిరించిన వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయింది. ఆ కేసులో రజనీపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసారు.
Also Read : అగ్ని ప్రమాదంలో పవన్ కుమారుడు.. అసలేం జరిగింది..?
ఇక ఐపిఎస్ అధికారి జాషువాపై కూడా ఈ వ్యవహారంలో కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఆమె మరిది గోపిని అడ్డం పెట్టుకుని.. ఆమె చేసిన వ్యవహారం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. విడదల రజినిపై చిలకలూరిపేట పబ్లిక్ గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేసారు రైతులు. రజిని, రజిని మామ, మరిదిపై ఫిర్యాదు చేసిన పసుమర్రు రైతులు.. తమకు న్యాయం చేయాలని కోరారు. వైసీపీ అధికారంలో పసుమర్రులో రోడ్డును ఆక్రమించుకుని రజిని మామ అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆవేదన వ్యక్తం చేసారు.
Also Read : రాజధాని అమరావతికి మరో బిగ్ న్యూస్..!
ఆక్రమించుకన్న స్థలానికి గోడకట్టారు అని గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేసారు. కూటమి ప్రభుత్వం రాగానే విడదల రజిని మామ లక్ష్మీనారాయణ స్థలాన్ని పసుమర్తి పంచాయతీకి రాసిచ్చారని.. విడదల లక్ష్మీనారాయణ కొడుకు రాము కోర్టుకెళ్లి స్టే తెచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పసుమర్రులో జగనన్న కాలనీ కోసం ప్రభుత్వం 200 ఎకరాలు పొలం కొనుగోలు చేసిందన్నారు. భూములు ఇచ్చిన రైతుల నుంచి లంచం తీసుకున్నారని లంచం తీసుకున్న డబ్బుల్లో కొంత తిరిగిచ్చారన్నారు. ఇంకా నలభై లక్షలు ఇవ్వలేదని ఫిర్యాదు చేసారు. ఈ వ్యవహారంలో పోలీసులకు ఆధారాలు కూడా ఇస్తామని, తమకు న్యాయం చేయాలని కోరారు రైతులు.