Friday, September 12, 2025 10:59 PM
Friday, September 12, 2025 10:59 PM
roots

సంచలనంగా మారిన ఏపీ సచివాలయ అగ్ని ప్రమాదం

ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో శుక్రవారం ఉదయం చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం అనేక అనుమానాలకు దారి తీస్తోంది. సచివాలయం రెండో బ్లాక్ లో జరిగిన ఈ అగ్ని ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఫోకస్ పెట్టింది. సచివాలయం రెండవ బ్లాక్ వద్ద బ్యాటరీ రూమ్ లో ఉదయం 6:30 గంటలకు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్నిప్రమాదం జరిగిన బ్యాటరీ ప్రదేశానికి హోంమంత్రి వంగలపూడి అనిత చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరుని, కారణాలను స్వయంగా అధికారులను అడిగి తెలుసుకున్నారు మంత్రి.

Also Read : హిట్ 3 క్లైమాక్స్ లో షాకింగ్ ట్విస్ట్..?

ప్రమాదానికి గల కారణాలను హోం మంత్రి కి జిఎడి పొలిటికల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా, ఫైర్ డి జి మాదిరెడ్డి ప్రతాప్ లు వివరించారు. ప్రమాదం జరిగిన రూంలో ఫైర్ అలారం సిస్టం లేకపోవడం పట్ల హోం మంత్రి అసహనం వ్యక్తం చేసారు. సచివాలయంలోని అన్ని బ్లాక్ లలో పూర్తిస్థాయిలో తనిఖీ చేసి అగ్ని ప్రమాదాల విషయంలో ఏ మేరకు సురక్షితమో రిపోర్టు ఇవ్వాలని హోంమంత్రి ఆదేశించించారు. సచివాలయంలో డిప్యూటీ సీఎం, హోం మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి ఉండే కీలక బ్లాకులు ఈ ప్రమాదం జరగడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేసారు అనిత.

Also Read : బ్రేకింగ్: ఏపీ సిఎంవోలో భారీ మార్పులు..?

ఇక ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే సచివాలయం కు చేరుకున్న ఫోరెన్సిక్ బృందం.. పూర్తి స్థాయి దర్యాప్తుకు హోమ్ మంత్రి ఆదేశించారు. సచివాలయంలో ఫైర్ సేఫ్టీ అడిట్ నిర్వహిస్తామని అన్నారు. రెండో బ్లాక్ వద్ద జరిగిన ప్రమాదాన్ని స్వయంగా పరిశీలించిన సీఎం చంద్రబాబు.. జరిగిన ప్రమాదం తీరుపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదాన్ని గల కారణాలని సీఎం కి సిఎస్ విజయనంద్.. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా.. ఫైర్ డీజి మాదిరెడ్డి ప్రతాప్.. జిఎడి సెక్రెటరీ ముఖేష్ కుమార్ మీనా… హోమ్ మంత్రి అనిత వివరించారు. ఇక దీనిపై కేసు కూడా నమోదు చేసారు అధికారులు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్