గత వైసీపీ ప్రభుత్వంలో తీవ్ర స్థాయిలో అవినీతి జరిగిందని ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. దానికి సంబంధించి ఏపిలో మాజీ మంత్రులకు ఒక్కొక్కరికి ఉచ్చు బిగుస్తోంది. వైసిపి అధికారంలో ఉన్న సమయంలో చెలరేగిపోయిన మాజీ మంత్రులు కొంతమందిపై ఏసీబీతో పాటుగా సిఐడి కూడా ఫోకస్ పెడుతుంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విడుదల రజిని, జోగి రమేష్, కొడాలి నాని వంటి వారి అవినీతి వ్యవహారాలపై ఇప్పటికే ఫోకస్ పెట్టారు. త్వరలోనే రామచంద్రారెడ్డిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది అనే వార్తలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం పెద్దిరెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.
Also Read: కొలికిపూడి అల్టిమేటం.. అసలు గొడవేంటి..?
ఇదిలా ఉంచితే నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పై ఫోకస్ పెట్టారు అధికారులు. వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఆయన చేసిన అవినీతి కార్యక్రమాలకు సంబంధించి ఆధారాలను సేకరించారు. ఇక తాజాగా ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసి తనపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా మద్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టును కోరగా ఆ పిటిషన్ డిస్మిస్ చేసింది కోర్ట్. విచారణ జరగకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. దీనితో కాకాని గోవర్ధన్ రెడ్డిని అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని ప్రచారం మొదలైంది. ఆయన మాజీ మంత్రి కావడంతో అధికారులు గవర్నర్ అనుమతి కోరే అవకాశం కనబడుతోంది.
Also Read: కొలికిపూడి అల్టిమేటం.. అసలు గొడవేంటి..?
ఇటీవల రజిని వ్యవహారంలో కూడా గవర్నర్ అనుమతి తర్వాతనే ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు గోవర్ధన్ రెడ్డి విషయంలో కూడా అలాగే వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత కొన్నాళ్లపాటు గట్టిగా మాట్లాడిన గోవర్ధన్ రెడ్డి ఇప్పుడు కాస్త సైలెంట్ గానే ఉన్నారు. అయితే అధికారంలో ఉండగా ఆయన చేసిన అవినీతి, అక్రమాల విషయం ఇంకా ప్రజలు మర్చిపోలేదు. కోర్టులో ఉన్న ఫైల్స్ కూడా దొంగతనం చేయించారన్న ఆరోపణలు ఉన్నాయి. దానితో పాటు ఇసుక, స్థలాల ఆక్రమణలు, మట్టి రవాణాతో పాటు ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. మరి ప్రభుత్వం కొంచం గట్టిగా దృష్టి పెడితే ఆయన తీవ్ర ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది.