Saturday, September 13, 2025 12:44 AM
Saturday, September 13, 2025 12:44 AM
roots

డి లిమిటేషన్ పై రేవంత్ కీలక అడుగు

దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్ల తగ్గింపు విషయంలో పెద్ద రచ్చె జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వాన్ని ఈ విషయంలో రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకు ప్రతిపక్ష పార్టీలు ఏకం అవుతున్నాయి. ఇటీవల తమిళనాడు సిఎం స్టాలిన్ అధ్యక్షతన.. చెన్నైలో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలువురు ముఖ్యమంత్రులతో పాటుగా కీలక పార్టీల అధినేతలు పాల్గొని కేంద్రంపై పోరాటానికి సిద్దం అంటూ ప్రకటించారు. ఇక తెలంగాణా సిఎం రేవంత్ రెడ్డి.. ఈ విషయంలో కేంద్రాన్ని గట్టిగానే టార్గెట్ చేస్తూ వస్తున్నారు.

Also Read : బెట్టింగ్ యాప్స్.. రేవంత్ సంచలన నిర్ణయం

దీనిపై తెలంగాణాలో ప్రతిపక్ష, అధికార పార్టీలో ఏకతాటిపై ఉండటంతో తాజాగా అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. డీలిమిటేషన్‌పై తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసింది ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అన్నిపార్టీలను సంప్రదించాకే డీలిమిటేషన్‌ చేపట్టాలి అని వ్యాఖ్యానించిన రేవంత్ రెడ్డి.. పునర్విభజనకు జనాభా ఒక్కటే ప్రామాణికం కాదు అని అన్నారు. రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుని..నియోజకవర్గాల పునర్విభజన చేయాలన్నారు.

Also Read : పోలవరంపై చంద్రబాబు కీలక ప్రకటన

జనాభా నియంత్రణ రాష్ట్రాలకు శాపం కాకూడదు అన్నారు సిఎం. జనాభా తగ్గిన రాష్ట్రాలు నష్టపోకూడదు అని ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు పెంచాలి అని డిమాండ్ చేసారు. ఎక్కువ సీట్లు కేటాయించాలి అని కోరారు. ప్రస్తుతం ఉన్న లోక్‌సభ సీట్లను కొనసాగించాలని కేంద్రాన్ని కోరారు రేవంత్. అసెంబ్లీ సీట్లను 153కు పెంచాలని.. 2026లో జనాభా లెక్కలు చేపట్టి నియోజకవర్గాల.. పునర్విభజన చేపట్టాలనుకోవడం చర్చనీయాంశంగా మారిందన్నారు. 1971 తర్వాత జనాభా నియంత్రణ విధానాలను దక్షిణాది రాష్ట్రాలు అమలు చేశాయి అని.. కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా నియంత్రణ జరగలేదని మండిపడ్డారు. డీలిమిటేషన్ అనేది సౌత్‌కు లిమిటేషన్‌గా మారేప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేసారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్