ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్ట్ ను సందర్శించారు. ఉదయం 10:45కి ప్రాజెక్టు హిల్ వ్యూ పాయింట్ చేరుకున్న సిఎం.. ప్రాజెక్టులో క్షేత్ర స్థాయిలో పర్యటించిన అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు సిఎం. కూటమి అధికారంలోకి వచ్చాక మూడో సారి పోలవరం ప్రాజెక్టు వద్దకు వెళ్ళారు సిఎం. చివరిగా గతేడాది డిసెంబర్ 16న పోలవరం ప్రాజెక్టును సందర్శించారు ముఖ్యమంత్రి. 2027 డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేసేలా కృత నిశ్చయంతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ ఏడాది జనవరి 18న డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.
Also Read : బాబు మంత్రివర్గం లోకి ఎవరు ఇన్.. ఎవరు ఔట్..?
వర్షాకాలంలోనూ పనులు కొనసాగించేలా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఎగువ కాఫర్ డ్యాం ఆనుకుని సమాంతరంగా డ్యాం నిర్మాణం చేపట్టనున్నారు. వరదల అనంతరం ప్రారంభం కానున్న ఈసీఆర్ఎఫ్ పనులు మొదలు అవుతాయి. ఇప్పటికే 41.15 కాంటూరు పరిధిలోని నిర్వాసితులకు పరిహారం చెల్లించైనా రాష్ట్ర ప్రభుత్వం కాలనీల నిర్మాణ పనులు, 45.72 కాంటూరు పరిధిలోని నిర్వాసితులకు పరిహారం చెల్లింపు దిశగా అడుగులు వేస్తోంది. ఇక సమీక్ష అనంతరం సిఎం చంద్రబాబు నాయుడు అధికారులతో మాట్లాడారు.
Also Read : ఒక్క ఫోటోతో ఉద్యోగం ఊడిందా..?
పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడో పూర్తి కావాల్సి ఉండేది అన్నారు. ప్రాజెక్ట్ ను గతప్రభుత్వం పక్కనపెట్టిందని.. తద్వారా ప్రాజెక్ట్ ఆలస్యంతో ఖర్చు పెరిగిపోయింది అన్నారు. 2014-2019 మధ్య 33 సార్లు ప్రాజెక్ట్ సందర్శించాను అని తెలిపారు. గత సీఎం ఐదేళ్లలో ఒక్కసారైనా కనిపించారా అని ప్రశ్నించారు చంద్రబాబు. పోలవరం కోసం నిర్వాసితులు భూమిని త్యాగం చేశారు అని.. గతంలో నిర్వాసితులకు రూ.4,311 కోట్లు చెల్లించామన్నారు. నిర్వాసితులను గత ప్రభుత్వం పట్టించుకోలేదు అని మండిపడ్డారు. రూ.10 లక్షల చొప్పున ఇస్తామని చెప్పి ఇవ్వలేదన్నారు. నిర్వాసితులకు రూ.828కోట్లు విడుదల చేశాం అని పేర్కొన్నారు. పునరావాసం కల్పించాకే ప్రాజెక్టులో నీళ్ల నిల్వ చేస్తామన్నారు. 2027లో ప్రాజెక్ట్ పూర్తి చేస్తామన్నారు.