Friday, September 12, 2025 07:46 PM
Friday, September 12, 2025 07:46 PM
roots

కొడాలి నానికి ఏమైంది..?

మాజీ మంత్రి కొడాలి నానికి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్య సమస్యల కారణంగా హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. అయితే ముందుగా గ్యాస్ట్రిక్ సమస్య అనుకున్నప్పటికీ.. గుండె సంబంధిత సమస్యలు కూడా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దీంతో అత్యవసర విభాగంలో కొడాలి నానికి వైద్యం అందిస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన కొడాలి నాని కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. గత ఎన్నికల్లో ఓడిన తర్వాత పూర్తిగా హైదరాబాద్‌కే పరిమితం అయ్యారు. గుడివాడ నుంచి వరుసగా 5 సార్లు గెలిచినప్పటికీ.. ఓడిన తర్వాత గుడివాడ ప్రజలకు ముఖం చూపించలేక హైదరాబాద్ వెళ్లిపోయారనే అపవాదు మూటగట్టుకున్నారు కొడాలి నాని.

Also Read : కడపలో వైసీపీకి షాక్ తప్పదా..?

ఓడిన నాటి నుంచి కొడాలి నాని రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. ఇందుకు ప్రధానంగా ఆయన పైన ఉన్న కేసులే కారణమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అధికారంలో ఉన్న సమయంలో గుడివాడలో క్యాసినో నిర్వహించారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. అలాగే పౌరసరఫరాల శాఖ మంత్రిగా పని చేసిన సమయంలో రేషన్ బియ్యం పంపిణీలో అక్రమాలు జరిగాయనేది ప్రధాన ఆరోపణ. అలాగే అధికారంలో ఉన్న ఐదేళ్లు కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పైన, ప్రస్తుత మంత్రి నారా లోకేష్ పైన విచక్షణా రహితంగా వ్యాఖ్యలు చేశారు. దీనిపై టీడీపీ నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు కూడా. ఈ నేపథ్యంలోనే రెడ్ బుక్‌లో నాని పేరు ఉందనే మాటలు కూడా వినిపిస్తున్నాయి.

Also Read : మంత్రి పదవి ఇస్తే సరి.. లేదంటే లేదంతే..!

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కూడా జగన్‌ దగ్గరకి తీసుకెళ్లారు కొడాలి నాని. ఇక వంశీ రెచ్చిపోవడం వెనుక నాని కూడా ఉన్నాడనేది టీడీపీ నేతల మాట. గుడివాడలో 20 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా, మంత్రిగా కొనసాగినప్పటికీ.. కనీసం తట్ట మట్టి కూడా వేయలేదనేది నియోజకవర్గం వాసుల ఆరోపణ. ఇక ఎన్నికలప్పుడు కూడా ఓట్లు రావనే భయంతో… ఇదే తన చివరి ఎన్నిక అని.. ఇక భవిష్యత్తులో పోటీ చేసేది లేదంటూ సానుభూతి వచ్చేలా ఓట్లు అడిగారు. కానీ ఓటర్లు మాత్రం.. నాని గ్యాంగ్ చేసిన అరాచకాలకు ఓటుతో బుద్ది చెప్పారు. ఇప్పటికే కొడాలి గ్యాంగ్‌లో అప్పట్లో రెచ్చిపోయిన కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక వంశీతో పాటు పోసాని కృష్ణమురళీని ఇప్పటికే అరెస్ట్ చేశారు. మరో మాజీ మంత్రి విడదల రజనీపై ఇప్పటికే ఏసీబీ కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో లిస్టులో నెక్ట్స్ తన పేరే ఉందనే భయంతోనే నాని ఆసుపత్రిలో చేరారనేది తెలుగు తమ్ముళ్ల మాట. ఎన్ని నాటకాలు ఆడినా వదిలేది లేదంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్