టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇంగ్లాండ్ పర్యటనలో కెప్టెన్ గా ఉంటాడా…? లేదా? అనే దానిపై ఇప్పుడు జనాల్లో ఇంట్రెస్ట్ మొదలైంది. దీనిపై సోషల్ మీడియాతో పాటుగా ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఆస్ట్రేలియా పర్యటనలో రోహిత్ శర్మ విఫలం కావడం పట్ల తీవ్ర స్థాయిలో ఆరోపణలు వచ్చాయి. దీనితో ఖచ్చితంగా ఇంగ్లాండ్ పర్యటనకు అతన్ని మారుస్తారు అనే వ్యాఖ్యలు వినిపించాయి.
Also Read : చాంపియన్స్ ట్రోఫీ.. పాకిస్తాన్ కు ఎన్ని కోట్లు నష్టమంటే…!
అయితే స్వదేశంలో జరిగిన ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్.. దుబాయ్ వేదికగా జరిగిన ఛాంపియన్ ట్రోఫీ మ్యాచ్ లో టీమిండియా ఘనవిజయం సాధించింది. చాంపియన్స్ ట్రోఫీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా టైటిల్ కైవసం చేసుకుంది రోహిత్ సేన. దానికి తోడు రోహిత్ శర్మ కూడా తిరిగి ఫామ్ లోకి వచ్చాడు. ఫైనల్ మ్యాచ్లో కీలక ఇన్నింగ్స్ ఆడటమే కాకుండా.. మాన్ అఫ్ ది మ్యాచ్ గా కూడా ఎంపికయ్యాడు. దీనితో ఇంగ్లాండ్ తో సీరీస్ కు పక్కాగా రోహిత్ శర్మను కెప్టెన్ గా ఎంపిక చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
Also Read : బెట్టింగ్ యాప్స్.. బయటకు వస్తున్న మోసగాళ్ళు..!
అతను ఇప్పట్లో క్రికెట్ నుంచి తప్పుకునే ఆలోచనలో లేకపోవడంతో.. బోర్డు కూడా అతని విషయంలో ఏ నిర్ణయం తీసుకునే అవకాశం లేదని వార్తలు వస్తున్నాయి. ఓపెనర్ గా వస్తున్న రోహిత్ శర్మ… ఇంగ్లాండ్ తో జరగబోయే టెస్ట్ సిరీస్ లో ఎలాగైనా సరే రాణిస్తాడని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో అటు విరాట్ కోహ్లీపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సమయంలో కెప్టెన్ ను మారిస్తే జట్టు ఆట తీరుపై ప్రభావం పడే అవకాశం ఉండటంతో.. కాస్త బోర్డు కూడా ఆలోచనలో పడినట్లు సమాచారం.
Also Read : తెలంగాణా ప్రభుత్వ బడ్జెట్ హైలెట్స్ ఇవే
ఇక కొంతమంది కీలక ఆటగాళ్లను ముందుగానే ఇంగ్లాండ్ పంపించి… అక్కడి పరిస్థితులకు అలవాటు పడేలా చేయాలని బోర్డు పెద్దలు భావిస్తున్నారు. అందుకే ఐపీఎల్లో పాల్గొనే ఆటగాళ్లకు ఇప్పటికే సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. మే రెండో వారం నుంచి కొంతమంది కీలక ఆటగాళ్లు ఇంగ్లాండ్ పర్యటనకు బయలుదేరి వెళ్లే అవకాశాలు ఉన్నాయి.