Monday, October 27, 2025 10:34 PM
Monday, October 27, 2025 10:34 PM
roots

రాజమౌళి – మహేష్ మూవీ లీక్.. టెక్నీషియన్ కు భారీ జరిమానా

దాదాపు 10 ఏళ్ల నుంచి సినిమాలను లీకుల వ్యవహారం బాగా ఇబ్బంది పెడుతోంది. స్టార్ హీరోలు సినిమాలు సోషల్ మీడియాలో రిలీజ్ అయిపోతున్నాయి. అలాగే సినిమా షూటింగ్ సమయంలో కూడా కొన్ని సన్నివేశాలను మొబైల్లో షూట్ చేసి రిలీజ్ చేసేస్తున్నారు. లేటెస్ట్ గా రాజమౌళి – మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న సినిమా విషయంలో కూడా ఇలాగే జరిగింది. ఈ సినిమాలో ఓ కీలక సన్నివేశం చిత్రీకరణ సందర్భంగా సోషల్ మీడియాలో ఒక వీడియో రిలీజ్ అయింది.

Also Read : పవన్ టార్గెట్ అదే.. అందుకే తేనె తుట్టును కదిపారా…?

ఇది పెద్ద ఎత్తున వైరల్ కావడంతో ఇప్పుడు రాజమౌళి జాగ్రత్త పడుతున్నాడు. సినిమా షూటింగ్ వద్ద భారీ భద్రతను కూడా పెంచేందుకు రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడు. ఇందులో మహేష్ బాబు లుక్ ఎలా ఉంటుంది.. అనేది వైరల్ చేయకూడదని రాజమౌళి చాలా పక్కాగా వ్యవహరించాడు. అలాగే సినిమా యూనిట్ తో ఒక ఒప్పందం కూడా చేసుకున్నాడు. చిత్ర దర్శకుడు, నిర్మాత మినహా మిగిలిన వారెవరు కూడా సినిమాకు సంబంధించి ఎటువంటి అప్డేట్ ఇవ్వకూడదని అందులో ఉంది.

Also Read : జనసేన వల్ల టీడీపీకి లాభమా.. నష్టమా..?

అయినా సరే సినిమాకు సంబంధించిన వీడియో రిలీజ్ అయింది. దీనిపై ఇప్పుడు చర్యలకు రాజమౌళి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అది ఎవరు చిత్రీకరించారు ఏంటి.. అనేదానిపై ఇప్పటికీ రాజమౌళి ఆధారాలతో సహా పట్టుకున్నట్లు సమాచారం. దీనితో సినిమా సెట్ లో ఉన్న సదరు టెక్నీషియన్ కు.. భారీగా జరిమానా విధించేందుకు కూడా సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Also Read : భారత్ అమెరికా సంబంధాలపై సంచలన సర్వే

ఇక సోషల్ మీడియా నుంచి సదరు సన్నివేశాలను తొలగించే దిశగా కూడా అడుగులు వేస్తోంది సినిమా యూనిట్. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా గురించి రాజమౌళి దాదాపు రెండేళ్ల నుంచి కష్టపడుతున్నాడు. లేటెస్ట్ గా సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. ప్రస్తుతం ఒడిస్సాలో సినిమా షూటింగ్ అవుతుంది. అక్కడికి వచ్చి షూటింగ్ చూసే వారు కూడా మొబైల్స్ ముందుగానే సబ్మిట్ చేసి రావాలని ఇప్పటికే కండిషన్ పెట్టినట్లు సమాచారం. ఇక లోకల్ గా వచ్చే స్థానికులను కూడా షూటింగ్ వద్దకు అనుమతించాలి అంటే మొబైల్ లేకుండానే వారిని అనుమతించే అవకాశం ఉందని సమాచారం.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్