గెలిచే అవకాశం లేనప్పుడు.. గెలిచే వాడి పక్కన చేరాలంటారు పెద్దలు. ప్రస్తుతం ఈ సూత్రాన్ని వైసీపీ నేతలు బాగా వంటపట్టించుకున్నట్లున్నారు. తాము గెలవకపోయినా పర్లేదు… పక్కనోడు మాత్రం గెలవకూడదు అనేలా రాజకీయాలు చేస్తున్నారు. పైగా తమ ఓటమికి కారణమైన వాళ్లను బలహీన పరిచే దిశగా రాజకీయాలు చేస్తున్నారు. ఏపీలో వైసీపీ ఘోర పరాజయానికి జనసేన పార్టీ ప్రధాన కారణం. తాడేపల్లిగూడెం సభలో చెప్పినట్లుగా జగన్‌ను అధఃపాతాళానికి తొక్కేశారు పవన్ కల్యాణ్. వై నాట్ 175 అని విర్రవీగిన జగన్‌కు కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాకుండా చేయడంలో గ్రాండ్ సక్సెస్ అయ్యారు పవన్ కల్యాణ్. దీంతో టార్గెట్ పవన్ అన్నట్లుగా వైసీపీ నేతలు పాలిటిక్స్ చేస్తున్నారు.
Also Read : వర్మ తెలివి పోసానికి లేకుండా పోయిందే..!
వాస్తవానికి తొలి నుంచి జనసేన పార్టీని వైసీపీ నేతలు టార్గెట్ చేశారు. పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. చివరికి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా.. సీఎం హోదాలో ఉన్నాడనే స్పృహ కూడా లేకుండా పవన్ వ్యక్తిగత జీవితంపై కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. 3 పెళ్లిళ్లు అంటూ వ్యంగ్యమైన కామెంట్లు చేశారు. ఇక అంబటి రాంబాబు, కొడాలి నాని, రోజా, గుడివాడ అమర్నాథ్, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, సీదిరి అప్పల్రాజు వంటి నేతలతో పాటు ద్వితీయ శ్రేణి నేతలు కూడా పవన్ క్యారెక్టర్ పైన విమర్శలు చేసి మరింత రెచ్చగొట్టారు. అయితే వైసీపీ ఓడిన తర్వాత కూడా ఏ మాత్రం ఆ పార్టీ నేతల తీరులో మార్పు రాలేదు. అదే తరహాలో ఇప్పుడు కూడా టార్గెట్ జనసేన అన్నట్లుగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు.
Also Read : ప్రజాక్షేత్రంలోకి జగన్.. జవాబు చెప్పాలన్న టీడీపీ..!
పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కల్యాణ్ కోసం సీటు త్యాగం చేశారు వర్మ. ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే ప్రస్తుతం ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయనకు అవకాశం రాలేదు. దీంతో వర్మ అభిమానులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అయితే వర్మ మాత్రం.. అధినేత తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ప్రకటించారు. ఇదే సమయంలో వర్మపైన వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. వర్మకు ఎమ్మెల్సీ సీటు రాకపోవడానికి పవన్ కారణమని.. ఇప్పటికైనా నిజం తెలుసుకో అంటూ రెచ్చగొడుతున్నారు. మీరు టీడీపీలో ఉంటే ఎలాంటి ప్రయోజనం ఉండదంటూ వ్యాఖ్యలు చేస్తూ.. ఇప్పటికైనా సరే జగన్‌తో చేతులు కలపొచ్చు కదా అంటూ ఆహ్వానం పలుకుతున్నారు. ఇక కొంతమంది అయితే.. పిఠాపురం మీదే.. పిఠాపురం రాజు మీరే.. అంటూ వెల్‌కమ్ వర్మ అంటూ పోస్టులు పెడుతున్నారు.