Friday, September 12, 2025 07:11 PM
Friday, September 12, 2025 07:11 PM
roots

ఆ 15 రోజులు బోరుగడ్డ ఎక్కడ…?

వైసీపీ మద్దతుదారు, రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్.. వ్యవహారంలో ఇప్పుడు ఏపీ పోలీసులు వ్యూహత్మంగా వ్యవహరిస్తున్నారు. ఆయన తప్పుడు సర్టిఫికెట్ సమర్పించి, జైలు నుంచి బయటకు వచ్చి ఎవరిని కలిశారు.. ఏంటి అనే దానిపై పోలీసులు ఆరా తీయడం మొదలుపెట్టారు. బెయిల్ పొందిన తర్వాత అనిల్ కుమార్ మీడియాకు కూడా కనపడలేదు. అసలు అతని గురించి ఎక్కడా న్యూస్ రాలేదు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసేసి ఉందని పోలీసులు గుర్తించారు.

Also Read : బాబు నిర్ణయంతో ఆ నేతల్లో భయం..!

అలాగే తన తల్లికి చికిత్స పేరుతో బోరుగడ్డ అనిల్ కుమార్ బెయిల్ తీసుకునే ప్రయత్నం చేశాడు. కానీ అసలు అతను.. తన తల్లి చికిత్స పొందుతున్న ఆసుపత్రి వద్దకు వెళ్లలేదని పోలీసులు నిర్ధారించారు. అసలు అతను చెన్నై వెళ్లలేదు అని.. సీసీ కెమెరా రికార్డులతో సహా పోలీసులు పరిశీలించారు. దీంతో బోరుగడ్డ అనిల్ కుమార్ ఎక్కడికి వెళ్ళాడు.. ఏంటి అనే దానిపై ఇప్పుడు పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ జరిపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎవరిని కలిశాడు.. అతను ఏమైనా వైసీపీ నేతలతో టచ్ లో ఉన్నాడా అనేదానిపై ఇప్పుడు ఆరా తీయడం మొదలుపెట్టారు.

Also Read : రజనీ కేసు ఆగినట్టేనా…? గవర్నర్ రియాక్షన్ ఎక్కడ…?

అప్పట్లో అనిల్ కు కొంత మంది వైసీపీ అగ్రనేతలు ఆర్థిక సహాయం అందించారు. అతని బ్యాంకు ఖాతాలో కూడా కోట్ల రూపాయల డబ్బు ఉన్నట్టు, లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. ఇక బోరుగడ్డ బ్యాంక్ ఖాతాలను కూడా ఇప్పటికే అధికారులు ఫ్రీజ్ చేశారు. అటు తన న్యాయవాదులకు ఇచ్చే డబ్బులకు వైసీపీ నుంచి ఎటువంటి ఆర్థిక సహాయం లేదు. అయినా సరే సొంత డబ్బులను అతను ఖర్చు చేస్తున్నాడు. దీనిపై కూడా అతని పోలీసులు ఆరాతీస్తున్నారు.

Also Read : వాళ్లకు లాస్ట్ వార్నింగ్.. చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు…!

లాయర్లకు ఇతరత్రా ఖర్చులకు అతను డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు.. అనేదానిపై ఇప్పుడు పోలీసులు వివరాలు సేకరించే పనిలోపడ్డారు. అందుకే అతను 15 రోజులపాటు ఎక్కడున్నాడు.. ఏంటి అనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత అతన్ని ఎవరైనా రిసీవ్ చేసుకున్నారా అనేదానిపై కూడా పోలీసులు ఆరా తీయడం మొదలుపెట్టారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్