ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో భారత్ ఏ రేంజ్ లో రాణిస్తుంది అనే దానిపై అభిమానులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. లీగ్ మ్యాచ్ ల్లో.. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్లో అడుగుపెట్టిన భారత జట్టు తడబడకుండా.. విజయం సాధిస్తుందా అనే దానిపై ఇప్పుడు అభిమానులను భయాలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా కీలక సమయాల్లో ఆటగాళ్లు వికెట్లు కోల్పోవడాన్ని భారత అభిమానులు సీరియస్ గా తీసుకుంటున్నారు. 2023 ప్రపంచ కప్ లో భారత్ ఇలాగే ఓడిపోయింది.
Also Read : గెలిచినా… ఉపయోగం లేకుండా పోయిందే..!
కీలక సమయంలో రోహిత్ శర్మ అనవసర షాట్ కోసం ప్రయత్నించి.. వికెట్ పారేసుకున్నాడు. దీనితో మ్యాచ్ పై తీవ్ర ప్రభావం పడింది. ఆ తర్వాత నుంచి కీలక ఆటగాళ్లు ఒక్కొక్కరిగా వెనతిరిగారు. ముఖ్యంగా పవర్ ప్లే లో భారత్ పరుగులు చేయడం పైనే జట్టు విజయ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. రోహిత్ శర్మ పవర్ ప్లే లో పరుగులు చేస్తాడని ఆశిస్తున్న భారత అభిమానులకు.. ఛాంపియన్ ట్రోఫీ లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ లు షాక్ ఇచ్చాయి. కీలక మ్యాచ్ లలో కూడా రోహిత్ శర్మ ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేకపోయాడు.
Also Read : మాజీల ఆశలు ఫలిస్తాయా..?
ఇక ఫైనల్ మ్యాచ్లో రోహిత్ శర్మ ఖచ్చితంగా ఆడకపోతే.. ఆ ప్రభావం జట్టుపై పడటం ఖాయం. ఇక ఓపెనర్ శుభమన్ గిల్ కూడా ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ లో మెరుగైన ప్రదర్శన చేసినా.. ఛాంపియన్స్ ట్రోఫీలో మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. కొన్ని మెరుగైన ప్రదర్శనలు మినహా అతని స్థాయికి తగ్గ ఆట తీరు కనబడలేదని చెప్పాలి. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మెరుగైన ఆట తీరుతో జట్టుకు విజయాలు అందిస్తున్నాడు.
Also Read : లాస్ట్ మ్యాచ్ ఆడేస్తున్న కెప్టెన్…!
ఇక మిడిల్ ఆర్డర్ లో శ్రేయాస్ అయ్యర్ నుంచి ఆశించిన స్థాయిలో ఇన్నింగ్స్ లు ఉంటున్నాయి. ఇక అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ ఇద్దరు మిడిల్ ఆర్డర్ భారాన్ని మోస్తున్నారు. జడేజా పెద్దగా రాణించిన పరిస్థితి లేదు. కాబట్టి బ్యాటింగ్ విభాగం చాలా జాగ్రత్తగా ఉండాలని.. వీలైనంత ఎక్కువ పరుగులు చేయాలని, అలాగే వికెట్ కాపాడుకోవడానికి కూడా ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం ఉందని అభిమానులు కోరుతున్నారు. విరాట్ కోహ్లీ దూకుడుగా ఆడటానికి ప్రయత్నం చేయడం కంటే తన సహజ ఆట తీరుతోనే ముందుకు వెళ్లడం మంచిదని సూచిస్తున్నారు.