ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కేబినేట్ సమావేశాలను నెలకు ఒకసారి నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పలు కీలక నిర్ణయాలకు ఆలస్యం జరగకుండా ప్రభుత్వం ఆమోద ముద్ర వేస్తోంది. గతంలో మాదిరిగా ఆలస్యం జరగకుండా నెల మొదటి వారంలో… నెల చివరి వారంలో ఓ రోజు కేబినేట్ సమావేశం నిర్వహిస్తున్నారు. నేడు ఏపీ సచివాలయంలో కేబినేట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది కేబినేట్. 14 అంశాలతో కేబినేట్ సమావేశం జరగగా వాటికి ఆమోద ముద్ర వేసింది.
Also Read : టీడీపీ ఎమ్మెల్యే రచ్చ.. ప్రభుత్వం పరువు తీస్తున్నారా…??
పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖలో డీపీఓలకు నేరుగా రిపోర్టు చేసేలా కేడర్ లో మార్పులు చేస్తూ ఆమోద ముద్ర వేసింది. కేడర్ రేషనలైజేషన్ పై ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ సమర్పించింది. పౌరసేవలు నేరుగా ప్రజలకు అందేలా చూసేలా కేడర్ లో మార్పు చేర్పులకు నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ప్రైవేటు యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లు 2025పై ఉన్నత విద్యాశాఖ ప్రతిపాదనలు పంపించింది. కుప్పం నియోజకవర్గంలో ఐదు కోట్లతో డిజిటల్ హెల్త్ నెర్వ్ సెంటర్ ఏర్పాటుపై వైద్యారోగ్యశాఖ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు.
Also Read : కొడాలి నానీ అక్రమాలపై గురి పెట్టినట్టేనా…?
సెంట్రల్ పూల్ లో 372 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను సృష్టించేందుకు కేబినెట్ కు ఆరోగ్య శాఖ ప్రతిపాదనలు సిద్దం చేయగా వాటికి కేబినేట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో ఎంఎస్ఎంఈ పార్కు నిర్మాణం కోసం ఉచితంగా 27 ఎకరాల భూమి కేటాయించే అంశంపై చర్చ జరిగింది. గీత కులాలకు కేటాయించిన 335 మద్యం దుకాణాల్లో నాలుగు దుకాణాల్ని సొండి కులాల వారికి కేటాయిస్తూ చేసిన సవరణను ఆమోదించింది. 2024-29 ఏపీ టూరిజం ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.