గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ కు బెయిల్ వస్తుందా..? రాదా…? దీనిపై ఇప్పుడు చాలా చర్చలే జరుగుతున్నాయి. గన్నవరం పార్టీ ఆఫీస్ పై దాడి కేసు, అనుచిత వ్యాఖ్యల కేసు, భూ అక్రమాల కేసులు, కిడ్నాప్ కేసులు.. ఇలా ఎన్నో ఇప్పుడు వంశీపై సిద్దం చేసారు పోలీసులు. వల్లభనేని వంశీ బెయిల్ పిటీషన్ పై విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టులో విచారణ జరిగింది నేడు. వంశీకి బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందన్న పబ్లిక్ ప్రాక్యూషన్.. బెయిల్ ఇవ్వొద్దు అని కోరారు.
Also Read: మళ్ళీ దేవినేని వర్సెస్ వంగవీటి.. ఎవరు నిలుస్తారో…?
కస్టడీ లో విచారించిన సమయంలో కీలకమైన సమాచారం తెలిసిందన్న పిపి.. వంశీతో పాటు, మరో ఇద్దరిని కస్టడీ లో విచారణ చేసే సమయంలో వారు కూడా.. వంశీ ఆదేశాలు తోనే సత్యవర్ధన్ ను కలిసినట్లు అంగీకరించారని కోర్టుకు తెలిపారు. ఈ పరిస్థితులు నేపధ్యంలో బెయిల్ ఇవ్వద్దని కోర్టును విజ్ఞప్తి చేసారు. మరింత సమాచారం కోసం వంశీని పది రోజులు కస్టడీ ఇవ్వాలని పిటీషన్ ను వేసిన విషయం వివరించారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కు, వంశీకి ఎటువంటి సంబంధం లేదని వంశీ తరపు న్యాయవాదులు వాదించారు.
Also Read: కూటమి కసరత్తు.. ఎమ్మెల్సీ కుంపటిలో టీడీపీ
ప్రభుత్వం కావాలనె వంశీ పై తప్పుడు కేసు పెట్టారని తమ వాదనలు వినిపించారు. వంశీకి అనారోగ్యం కారణాల వల్ల బెయిల్ మంజూరు చేయాలని వంశీ తరపు న్యాయవాది కోరారు. వంశీకి బెయిల్ మంజూరు చేయడం వల్ల సాక్షులను ఇబ్బంది పెట్టే అవకాశం లేదని న్యాయాధికారికి విజ్ఞప్తి చేసారు. ఇరు పక్షాల న్యాయవాదుల వాదనలు విన్న న్యాయాధికారి.. కేసు విచారణ ఈనెల పదికి వాయిదా వేసారు. ఇక వంశీపై గన్నవరంలో తాజాగా మరో కేసు నమోదు అయింది. కబ్జా వ్యవహారంలో వంశీపై కేసు నమోదు చేసారు.