వైట్ బాల్ క్రికెట్ లో గుజరాత్ ఆటగాడు అక్షర్ పటేల్ చెలరేగిపోతున్నాడు. ఇటీవల జరుగుతున్న మ్యాచుల్లో అతని ప్రదర్శన చూసిన అభిమానులు.. అక్షర పటేల్ పై నమ్మకం పెంచుకుంటున్నారు. ఒకప్పుడు రవీంద్ర జడేజా లోయర్ ఆర్డర్లో మెరుగ్గా బ్యాటింగ్ చేసేవాడు. ఇక బౌలింగ్ పరంగా కూడా జడేజా పై నమ్మకం పెట్టుకునే వాళ్ళు కెప్టెన్లు. ఇక ఇప్పుడు అక్షర్ పటేల్ ఆ స్థానాన్ని భర్తీ చేయడంలో సక్సెస్ అవుతున్నాడు. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాలతో పాటుగా ఫీల్డింగులో కూడా అక్షర్ పటేల్ దుమ్మురేపుతున్నాడు.
Also Read : రాకున్నా.. వచ్చినట్లు బిల్డప్ ఇస్తున్నారేమిటో…!
లేటెస్ట్ గా జరిగిన న్యూజిలాండ్ తో మ్యాచ్ లో ఫీల్డింగ్ లో కూడా సత్తా చాటాడు అక్షర్ పటేల్. అటు బ్యాటింగ్ లో కూడా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాడు. మిడిల్ ఆర్డర్లో లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ కావాలనుకున్న గంభీర్ కు పర్ఫెక్ట్ ఆప్షన్ గా నిలిచాడు. న్యూజిలాండ్ తో కీలకమైన సమయంలో చేసిన 42 పరుగులు మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసాయి. శ్రేయాస్ అయ్యర్ తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇక బౌలింగ్ లో కూడా కీలక సమయంలో వికెట్లు తీస్తూ మంచి ప్రదర్శన చేస్తున్నాడు.
Also Read : నటరాజన్ టీమ్ రెడీ.. టీపీసీసీలో పదవులు ఎవరికంటే..?
దూకుడుగా ఆడే ప్రయత్నం చేస్తున్న న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కెన్ విలియమ్సన్ ను కీలక సమయంలో అవుట్ చేసి మ్యాచ్ ను మలుపు తిప్పాడు. గత ఏడాది జరిగిన టి20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్లో కూడా ఈ ఆటగాడు అదిరిపోయే ప్రదర్శన చేశాడు. వికెట్లు పడుతున్న సమయంలో వచ్చి దూకుడుగా బ్యాటింగ్ చేసి కీలక పరుగులు చేయడంలో సక్సెస్ అయ్యాడు. దీనితో ఛాంపియన్స్ ట్రోఫీలో రాబోయే మ్యాచ్ లో ఇతను ఏ విధంగా రాణిస్తాడు అనే దానిపై ఆసక్తి పెరిగింది. ఆస్ట్రేలియాతో జరగబోయే మ్యాచ్ లో ఇతని ప్రదర్శన పై అభిమానులు చాలా నమ్మకాలు పెట్టుకున్నారు. టెస్ట్ క్రికెట్లో కూడా అవకాశం వచ్చిన ప్రతిసారి అక్షర్ పటేల్ నిరూపించుకుంటూనే ఉన్నాడు.