Friday, September 12, 2025 08:59 PM
Friday, September 12, 2025 08:59 PM
roots

కోహ్లీ సెంచరీ అడ్డుకునే కుట్ర జరిగిందా…?

టీం ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ తిరిగి ఫామ్ లోకి రావడం పై అభిమానులు పండగ చేసుకున్నారు. గత కొన్ని రోజులుగా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న విరాట్ కోహ్లీ.. పాకిస్తాన్ మ్యాచ్లో సెంచరీ చేయడంపై సోషల్ మీడియాలో ప్రశంసలు వ్యక్తం అవుతున్నాయి. కీలక సమయంలో బ్యాటింగ్ వచ్చిన విరాట్ కోహ్లీ నిలకడగా బ్యాటింగ్ చేస్తూ అవసరం అయిన సమయంలో దూకుడుగా ఆడుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. పాకిస్తాన్ పదే పదే బౌలర్లను మార్చినా.. విరాట్ కోహ్లీ ఎక్కడ ఒత్తిడికి గురి కాలేదు.

Also Read : ఆ ఇద్దరూ వచ్చేస్తున్నారు.. పాక్ తో మ్యాచ్ పై భారత్ ఫోకస్

అయితే ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ సెంచరీ అడ్డుకోవడానికి డ్రెస్సింగ్ రూమ్ నుంచి ప్రయత్నాలు జరిగాయి అనే ఆరోపణలు వినపడుతున్నాయి. సాధారణంగా ఎవరైనా ఆటగాడు సెంచరీ సమయంలో హార్దిక్ పాండ్యా క్రీజ్ లోకి వస్తే వాళ్ళ సెంచరీ అడ్డుకోవడానికి అతను ప్రయత్నం చేస్తాడనే ఆరోపణ ఎక్కువగా వినపడుతూ ఉంటుంది. అవసరం లేకపోయినా సరే దూకుడుగా ఆడుతూ ఉంటాడని.. ఇతర ఆటగాళ్లు అలాగే వాళ్ళ అభిమానుల మనోభావాలను పట్టించుకోకుండా అతను వ్యవహరిస్తాడు అనేది ప్రధాన విమర్శ.

Also Read : ఏపిలో డయల్ యువర్ సీఎం.. ఎవరికి.. ఎందుకు?

ఇప్పుడు పాకిస్తాన్ తో మ్యాచ్ లో కూడా బ్యాటింగ్ ఆర్డర్ లో ఆరో స్థానంలో లేదంటే ఏడో స్థానంలో రావాల్సిన హార్దిక్ పాండ్యాను ముందుగానే బ్యాటింగ్ కు పంపించారు. శ్రేయస్ అయ్యర్ అవుట్ అయిన వెంటనే హార్దిక్ పాండ్యాను పంపడంపై అనేక అనుమానాలు వస్తున్నాయి. ఇక పాండ్యా వచ్చిన వెంటనే దూకుడుగా ఆడటం చూసి అభిమానులు షాక్ అయ్యారు. అయితే అనూహ్యంగా అతను షాహిన్ అఫ్రిది బౌలింగ్ లో అవుట్ అవడం.. ఆ తర్వాత వచ్చిన అక్షర్ పటేల్.. విరాట్ కోహ్లీకి సహకరించడంతో కోహ్లీ సెంచరీ పూర్తి చేసాడు. ఇక ఈ సెంచరీ కోసం క్రికెట్ ప్రపంచం మొత్తం అలా చూస్తూ ఉండిపోయింది. ప్రస్తుతం కోహ్లీ నామస్మరణతో సోషల్ మీడియా షేక్ అవుతుంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్