యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. తన గత సినిమాల కంటే ప్రస్తుతం చేస్తున్న సినిమాలను చాలా స్పీడ్ గా కంప్లీట్ చేసే ప్లాన్ చేస్తున్నాడు. దేవర సినిమా సక్సెస్ తో మంచి స్వింగ్ లో ఉన్న ఎన్టీఆర్.. వార్ 2 షూటింగ్ కంప్లీట్ చేసి హైదరాబాద్ లో దిగాడు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమా కోసం వర్కౌట్ స్టార్ట్ చేసాడు. వచ్చే వారం నుంచి ఈ సినిమా షూట్ లో ఎన్టీఆర్ రెగ్యులర్ గా పాల్గొంటాడు అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఇక ఎన్టీఆర్ కూడా ఇప్పుడు లేట్ చేయవద్దు అనే డిసైడ్ అయినట్టే కనపడుతోంది.
Also Read : జగన్ కు మరో మాజీ ఝలక్ ఇస్తారా..?
సాధారణంగా స్టార్ హీరోల సినిమాలు లేట్ అవుతున్నాయి. భారీ బడ్జెట్ అనే ట్యాగ్ లైన్ తో సినిమా చేస్తూ హైప్ పెంచేస్తున్నారు. ఇది ఫ్యాన్స్ కు చిరాకుగా ఉంది. సినిమా హిట్ అయిందనే సంతోషం కంటే తమ హీరో సినిమా ఎప్పుడు వస్తోంది అనే క్లారిటీ కోసమే ఎదురు చూస్తున్నారు. రిజల్ట్ పై కూడా గ్యారెంటీ లేదు. అందుకే ఇప్పుడు ఎన్టీఆర్ రూట్ మారుస్తున్నాడు. తన సినిమాలు ఏడాదికి ఒకటి అయినా రిలీజ్ అవ్వాలని టార్గెట్ పెట్టుకున్నాడు. దేవర సినిమాను లాస్ట్ ఇయర్ రిలీజ్ చేసాడు.
Also Read : వచ్చే సంక్రాంతికి టాలీవుడ్ లో యుద్ద మేఘాలు
ఈ ఏడాది వార్ 2 సినిమా ఉంటుంది. ఇక వచ్చే ఏడాది ప్రశాంత్ నీల్ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయడం ఖాయంగా కనపడుతోంది. ఇక అది కంప్లీట్ అయిన వెంటనే సందీప్ రెడ్డి వంగా ప్రాజెక్ట్ టేకప్ చేస్తాడు. సందీప్ రెడ్డి.. ప్రస్తుతం ప్రభాస్ తో బిజీగా ఉన్నాడు. అది అయిన వెంటనే ఎన్టీఆర్ తో స్టార్ట్ చేసేస్తాడు. సందీప్ ప్రాజెక్ట్ అయిన వెంటనే నెల్సన్ దిలీప్ కుమార్ లేదంటే లోకేష్ కనగరాజ్ సినిమా షూట్ లో పాల్గొంటాడు. ఈ మధ్యలో దేవర 2 కూడా ఉంది. దీనితో ప్రభాస్ మాదిరిగా కనీసం ఏడాదికి ఒక్క సినిమా అయినా రిలీజ్ చేసేయాలని టార్గెట్ పెట్టుకున్నట్టే కనపడుతోంది.