Friday, September 12, 2025 08:54 PM
Friday, September 12, 2025 08:54 PM
roots

వంశీ కి ఊహించని షాక్ ఇచ్చిన హైకోర్టు

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ విషయంలో కృష్ణాజిల్లా పోలీసుల ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఇప్పటికే ఆయనపై గతంలో నమోదైన కేసులను ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నారు విజయవాడ పోలీసులు. ఎన్నికల సమయంలో జరిగిన కొన్ని ఘర్షణలు అలాగే గన్నవరం పార్టీ ఆఫీస్ పై జరిగిన దాడికి సంబంధించిన కొన్ని కీలక అంశాల్లో విజయవాడ పోలీసులు ఉచ్చు బిగిస్తున్నారు. ఇప్పటికే సత్య వర్ధన్ ను కిడ్నాప్ చేసిన కేసులో వంశీని విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వంశీ తో పాటుగా అనుచరులను కూడా పోలీసులు కొంతమందిని అరెస్టు చేశారు.

Also Read : జగన్ కామెంట్స్ తో డైలమాలో వైసీపీ సోషల్ మీడియా

ఇక మరో ముగ్గురు నలుగురు వంశి అనుచరుల కోసం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పలు బృందాలు గాలిస్తున్నాయి. ఇక తాజాగా ఏపీ హైకోర్టు వల్లభనేని వంశీకి షాక్ ఇచ్చింది. గన్నవరం టిడిపి కార్యాలయం పై దాడి కేసులో గతంలోని వంశీ ముందస్తు బెయిల్ తీసుకున్నారు. తాజాగా ఆ బెయిల్ రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఇదే కేసులో ఏ 71 గా వల్లభనేని వంశీ ఉన్నారు. ఇక ఎస్సీ ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని హైకోర్టు వంశీకి సూచించింది.

Also Read : అసలు జగన్ కు ఆ అర్హత ఉందా..?

అయితే ఈ బెయిల్ రద్దు విషయంలో విజయవాడ పోలీసులు అత్యంత కీలకంగా వ్యవహరించారు. సత్య వర్ధన్ కిడ్నాప్ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు అందుకు సంబంధించిన సాక్షాలను కోర్టు ముందు ఉంచారు. కిడ్నాప్ కు సంబంధించిన వీడియోలు కూడా పోలీసులు కోర్టుకు సమర్పించారు. ఆ సాక్షాలను పరిశీలించిన హైకోర్టు వంశీ బెయిల్ రద్దు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఇక ఈ కేసుతో పాటుగా పలు కేసుల్లో కూడా వంశీ ముందస్తు బెయిల్ దాఖలు చేయగా ఆ కేసుల్లో కూడా వంశీకి బెయిల్ రావడం కష్టమనే అభిప్రాయం వినపడుతోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్