Friday, September 12, 2025 10:41 PM
Friday, September 12, 2025 10:41 PM
roots

ఆ విషయం తేల్చి చెప్పిన కేంద్రం..!

ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ ఎన్నో కీలక మార్పులు చేర్పులు చేపడుతుంది. తాజాగా బడ్జెట్ సమావేశాల్లో ఆదాయ పన్ను రూ.12 లక్షలకు పెంచుతూ మధ్యతరగతి ప్రజలకు ఊరాట కల్పించింది. అయితే ఒక విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం విసులుబాటు కల్పించటం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా రైలులో ప్రయాణించే సీనియర్ సిటిజనులకు రాయితీ విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం విమర్శల పాలవుతుంది. అయితే తాజాగా ఓ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. కరోనా సమయంలో సీనియర్ సిటిజనులతో పాటు.. అన్ని రాయితీలను ఎత్తేస్తున్నట్లు అప్పట్లో రైల్వే శాఖ ప్రకటించింది. కానీ ఇప్పటివరకు సీనియర్ సిటిజన్ ల విషయంలో మాత్రం దానిని పునరుద్ధరించ లేదు. ప్రస్తుతం సీనియర్ సిటిజనులకు రాయితీ పునరుద్ధరిస్తున్నట్లు సోషల్ మీడియాలో మెసేజ్ తెగ సర్కులేట్ అవుతోంది. దీనిపై ఇప్పటికే చాలామంది రైల్వేస్టేషన్లో కూడా వెళ్లి టికెట్లపై రాయితీ ఇవ్వాలని కౌంటర్లలో అడుగుతున్నారు కూడా. అధికారిక ఉత్తర్వులు ఎప్పుడు వస్తాయని కొందరు ఎదురుచూస్తున్నారు కూడా.

Also Read : అసలు జగన్ కు ఆ అర్హత ఉందా..?

అయితే ఈ విషయాన్ని సీరియస్ గా పరిగణించిన రైల్వే శాఖ… సోషల్ మీడియా పుకార్లపై క్లారిటీ ఇచ్చేసింది. సీనియర్ సిటిజెన్లకు రాయితీని పునరుద్ధరిస్తున్నట్లు సర్క్యులేట్ అవుతున్న మెసేజ్ ను ఫేక్ అని తేల్చి చెప్పేసింది. ఎలాంటి రాయితీలపైన కూడా అధికారిక ప్రకటన వెలువడ లేదని అధికారులు క్లారిటీ ఇచ్చారు.

Also Read : జగన్ గాలి తీస్తున్న పాత జీవో

గతంలో సీనియర్ కిటికీనులకు రైల్వే శాఖ 50% రాయితీ ఇచ్చింది. ప్రధానంగా 55 ఏళ్లు వయసు దాటిన మహిళలకు, పురుషులకు 60 ఏళ్లు దాటిన తర్వాత అన్ని తరగతులలో 50 శాతం రాయితీ ఇచ్చారు. అలాగే పాత్రికేయులకు కూడా 50% రాయితీ అందించింది. కానీ కరోనా సమయంలో ఈ రాయితీలను రైల్వే శాఖ రద్దు చేసింది. రైళ్లను పునరుద్ధరించినప్పటికీ ఈ రాయితీలపై మాత్రం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనిపై ఇప్పటికే పలువురు పార్లమెంటు సభ్యులు ఉభయ సభల్లో కూడా కేంద్రాన్ని కోరినప్పటికీ రైల్వే శాఖ నుంచి నో అనే జవాబే వచ్చింది. దీంతో రాయితీ విషయంలో అటు సీనియర్ సిటిజనులలో, ఇటు పాత్రికేయులలో ఆశలు సన్నగిల్లాయి. అయితే సోషల్ మీడియా మెసేజ్ నేపథ్యంలో మరోసారి ఆశపడిన పెద్దలకు మాత్రం కేంద్రం నో చెప్పేది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్