Saturday, September 13, 2025 12:51 AM
Saturday, September 13, 2025 12:51 AM
roots

వైసీపీ ప్రతాపం అంతా అక్కడేనా?

ఏపీలో వైసీపీ నేతల పరిస్థితిపై జనాలు తెగ చర్చించుకుంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. లేనప్పుడు మరోలా వ్యవహరిస్తున్నారనేది అందరికీ తెలిసిన విషయమే. ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు టార్గెట్ టీడీపీ అన్నట్లుగా వ్యవహరించారు. ఇక ఎన్నికల సమయంలో అయితే ప్రతిపక్షమే అవసరం లేదని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు కూడా. అయితే చివరికి 11 స్థానాలు మాత్రమే రావడంతో అసెంబ్లీకి వచ్చేందుకు కూడా ముఖం చెల్లక బయటే తిరుగుతున్నారు. సభ్యులుగా ప్రమాణస్వీకారం చేయటానికి మాత్రమే సభకు వచ్చిన వైసీపీ నేతలు.. ఆ తర్వాత జరిగిన మూడు సభలకు దూరంగానే ఉన్నారు.

Also Read : ఆ చిన్నారి పెయిడ్ ఆర్టిస్ట్.. ప్రూఫ్ లతో సెటైర్లు

ఇదే సమయంలో శాసనమండలికి మాత్రం వైసీపీ నేతలు హాజరవుతున్నారు. అయితే మండలిలో కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించిన ప్రతిసారి గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన విధానాలను మంత్రులు, కూటమి సభ్యులు గుర్తు చేస్తుండటంతో జవాబు చెప్పలేక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో సభ జరుగుతున్నప్పుడు వైసీపీ నేతలు బయటే ఉండి.. ప్రెస్ మీట్ ద్వారా ప్రభుత్వాన్ని నిలదీస్తామని గొప్పగా చెప్పుకుంటున్నారు. అలా సభలో కాకుండా బయటే ప్రెస్ మీట్ పెట్టేలా అయితే.. ఇక పార్లమెంట్, అసెంబ్లీ ఎందుకు.. కోట్లు ఖర్చు చేసి సభలు నిర్వహించడం ఎందుకు అనే ప్రశ్నకు జవాబు చెప్పలేక సైలెంట్ అవుతున్నారు.

Also Read : రేవంత్ ను ఒంటరి చేసిన టీ కాంగ్రెస్

ఇక వైసీపీ తరఫున ఎన్నికైన 11 మంది ఎమ్మెల్యేల్లో ఒకరిద్దరు మాత్రమే కాస్త యాక్టివ్ గా ఉన్నారు. పెద్దిరెడ్డి బ్రదర్స్ చుట్టూ మైనింగ్ ఆరోపణలున్నాయి. అరకు, పాడేరు, దర్శి, బద్వేలు ఎమ్మెల్యేలు వ్యాపారాల్లో బిజీగా ఉన్నారు. ఇక యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్ మాత్రం సోషల్ మీడియాలో గంటకో పోస్ట్ పెడుతున్నారు. దీంతో తెలుగు తమ్ముళ్లతో పాటు నియోజకవర్గం ప్రజలు కూడా అదే సోషల్ మీడియాలో ఎమ్మెల్యేను నిలదీస్తున్నారు. మీరు ఈ సమస్యలపైన అసెంబ్లీలో మాట్లాడితే మళ్లీ మీరే గెలుస్తారు కదా అని సెటైర్లు వేస్తున్నారు. అసెంబ్లీకి వెళ్లకుండా.. మీ ప్రతాపం అంతా సోషల్ మీడియాలో చూపిస్తే ఎవరికి ఉపయోగం అంటూ నిలదీస్తున్నారు. ప్రజా సమస్యలపై ముందు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయండి… తర్వాత ప్రజలతో కలిసి పోరాటం చేయండి.. ఆ తర్వాత ఓట్లు అడగండి అంటూ కొందరు ఘాటు వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. మరికొందరైతే… గంటకో పోస్ట్ పెడుతున్నారు.. అంతా ఖాళీగా ఉన్నారా మీరు.. సెటైర్లు వేస్తున్నారు కూడా.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్