Friday, September 12, 2025 05:28 PM
Friday, September 12, 2025 05:28 PM
roots

బాలీవుడ్ ను బతికించిన ఛావా…?

2025 లో జనవరి, ఫిబ్రవరి నెలలో బాలీవుడ్ కు అసలు ఏమాత్రం కలిసి రాలేదు. ఏ సినిమా రిలీజ్ అయినా సరే పెద్దగా ప్రభావం చూపించలేదు. బాలీవుడ్ స్టార్ హీరోలు.. ముగ్గురు నలుగురు సినిమాలు రిలీజ్ చేశారు. అయినా సరే కలెక్షన్ల పరంగా పెద్దగా ఆకట్టుకోలేదు. అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, షాహిద్ కపూర్ వంటి వాళ్ళు రిలీజ్ చేసిన సినిమాలకు బాక్సాఫీస్ వద్ద పెద్దగా రెస్పాన్స్ లేదని చెప్పాలి. ఈ టైంలో వచ్చిన విక్కీ కౌశల్ ఛావా సినిమాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. కలెక్షన్లు పరంగా ఈ సినిమా బాలీవుడ్ కు ప్రాణం పోసిందని చెప్పాలి.

Also Read : సానుభూతి కోసం జగన్ నయా స్కెచ్

గత 5 ఏళ్ళ నుంచి సౌత్ ఇండియా సినిమా డామినేషన్ ముందు బాలీవుడ్ డామినేషన్ తగ్గిపోయింది. ఈ టైంలో వచ్చిన ఛావా సినిమాకు కలెక్షన్లు రోజురోజుకు పెరుగుతున్నాయి. ముందు 32 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా తర్వాత 39 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక మూడో రోజు 49 కోట్లు కలెక్ట్ చేసింది. బుధవారం చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉంది. దీనితో ఆ రోజు కచ్చితంగా 50 కోట్లకు పైగానే కలెక్ట్ చేసే ఛాన్స్ ఉందని అంచనాలు వేస్తున్నారు. ముందు సినిమాను విమర్శించిన వాళ్ళు ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు.

Also Read : థమన్ కి ప్రేమతో ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన బాలయ్య

ఇక జనాలకు సినిమా స్లోగా ఎక్కుతుంది. తెలుగులో కూడా హిందీ డబ్ అయినా సరే జనాలు మాత్రం గట్టిగానే చూస్తున్నారు. దీనితో సౌత్ ఇండియాలో కూడా సినిమాకు కలెక్షన్లు భారీగా వచ్చే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా విక్కీ కౌశల్ యాక్టింగ్ కు జనాలు ఫిదా అయిపోయారు. చివరి నలభై నిమిషాలు సినిమా కోసం ప్రాణం పెట్టి వర్క్ చేశాడు విక్కీ కౌశల్. ఇక రష్మిక మందనకు స్క్రీన్ టైం తక్కువగానే ఉన్న ఆమె కూడా యాక్టింగ్ పరంగా పరవాలేదు అనిపించింది.

Also Read : ఎందుకీ మౌనం..? కొడాలి నానీ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..!

ఇక లాంగ్ రన్ లో ఈ సినిమా 350 నుంచి 400 కోట్లు వరకు వసూలు చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సాధారణంగా హిందీ హీరోల సినిమాలకు మన తెలుగులో రెస్పాన్స్ తక్కువగా ఉంటుంది. కానీ విక్కీ కౌశల్ యాక్టింగ్ కోసం జనాలు క్యూ కడుతున్నారు. హిందీ అర్థం కాకపోయినా కొంతమంది సినిమా చూసి వచ్చి కామెంట్స్ చేస్తున్నారు. ఇక సినిమా చూసిన అనంతరం కొందరు కన్నీళ్లు పెడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

పోల్స్