Friday, September 12, 2025 05:25 PM
Friday, September 12, 2025 05:25 PM
roots

మీ రెగ్యులర్‌ డైట్‌లో అల్లం చేర్చుకుంటే.. ఆ రోగాలకు చెక్

అల్లం పోషకాలకు పవర్ హౌస్. ఇందులో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులోని జింజోరెల్‌, విటమిన్ b6, విటమిన్ సి అంతేకాదు పొటాషియం, మెగ్నీషియం మాంగనీస్ కూడా ఉంటుంది. అల్లం యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటుంది. అందువల్ల జీర్ణ క్రియకు ఎంతో మేలు చేస్తుంది. అల్లం తీసుకోవడం వల్ల కడుపులో అజీర్తి, గ్యాస్ సమస్యలకు చెక్‌ పెడుతుంది. అల్లం మలబద్ధక సమస్యకు మంచి నివారణ కూడా. ఇందులోని జింజోరైల్ జీర్ణ వ్యవస్థకు చాలా మేలు చేస్తుంది. కడుపులో గ్యాస్ సమస్యకు చక్కని రెమిడీ. అల్లం ఆహారంలో వినియోగిస్తాం. ఇది మంచి రుచిని అందించడమే కాదు, ఆరోగ్య ప్రయోజనాలు కూడా మెండు.

Also Read : అధికారులపై చంద్రబాబు సీరియస్..!

అల్లం యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటుంది. ఇది ప్రాణాంతక వ్యాధులను మన దరిచేరనివ్వకుండా కాపాడుతుంది. ముఖ్యంగా గుండె, డయాబెటిస్, ఆర్థరైటిస్ కి చక్కని రేమిడీ. రెగ్యులర్ గా డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇలాంటి వ్యాధులకు దరిచేరకుండా ఉంటాయి. ముఖ్యంగా ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పులకు రెమిడి. అల్లం తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ వ్యవస్థ బలపడుతుంది. దీంతో సీజనల్ జబ్బులు మన దరిచేరకుండా ఉంటాయి. ఇది బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా పోరాడుతుంది. వైరల్ జబ్బులు రాకుండా కాపాడుతుంది. ఆక్సిడేటీవ్‌ డ్యామేజ్‌ నుంచి అల్లం నివారిస్తుంది. ఇది ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. అల్లం తీసుకోవడం వల్ల తరచుగా వచ్చే సీజనల్ జబ్బులు రాకుండా ఉంటాయి.

Also Read : బన్నీ కోసం సల్మాన్ ను పక్కన పెట్టేసాడా…?

బరువు తగ్గాలనుకునే వాళ్ళు అల్లం రెగ్యులర్ గా తీసుకోవాలి. ఇది మెటబాలిజం రేటును పెంచుతుంది. కొన్ని నివేదికల ప్రకారం ఉదయం అల్లం నీటిని తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు.. రెగ్యులర్ డైట్లో అల్లం చేర్చుకోవడం వల్ల కడుపు నిండిన అనుభూతి కూడా ఎక్కువ సమయం పాటు కలిగిస్తుంది. అతిగా ఆకలి వేయనీయదు. అల్లం తీసుకోవటం వల్ల గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఇది కార్డియో ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరగనివ్వదు. కొన్ని నివేదికల ప్రకారం చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచి గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. అల్లం.. ఆరోగ్యకరమైన రక్త సరఫరాకు ప్రేరేపిస్తుంది. బీపీ అదుపులో ఉంచుతుంది, దీంతో గుండె సమస్యలు దరిచేరకుండా ఉంటాయి.

Also Read : మాట నిలబెట్టుకుంటున్న లోకేష్.. విద్యాశాఖ కీలక ప్రకటన

అల్లం తీసుకోవటం వల్ల వయస్సూ రీత్యా వచ్చే సమస్యలు కూడా చెక్ పెడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉండటం వల్ల ఆక్సిడేటీవ్‌ డ్యామేజ్ కాకుండా నివారిస్తుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. మన రెగ్యులర్ డైట్ లో అల్లం చేర్చుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు మెండు. ఇందులో మెడిసినల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. జీర్ణ, మెదడు ఆరోగ్యానికి, గుండె ఆరోగ్యానికి కూడా తోడ్పడుతుంది. అల్లం నేరుగా కూడా తింటారు. ఉదయం పరగడుపున నీటిని తాగడం వల్ల లాభాలు ఎక్కువగా పొందుతారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

పోల్స్