ఒకవైపు డాకు మహారాజ్ సినిమా సూపర్ హిట్ కావడం, మరోవైపు పద్మభూషణ్ అవార్డు రావడంతో నందమూరి బాలయ్య ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. సినిమా పరిశ్రమలో బాలయ్యను తక్కువ అంచనా వేసిన వాళ్లందరూ ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. ఇక బాలయ్యకు సన్మానం చేసే దిశగా సినిమా పరిశ్రమ పెద్దలు అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా సినిమా పరిశ్రమకు సంబంధించి పది అసోసియేషన్లు ఆయన ఇంటికి వెళ్లి సన్మానించాయి.
Also Read: నెట్ ఫ్లిక్స్ లో పుష్ప సరికొత్త రికార్డులు
ఇక సన్మాన కార్యక్రమాన్ని కూడా హైదరాబాదులో గ్రాండ్ గా నిర్వహించాలని సినిమా పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. ఈ సన్మాన కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులను ఆహ్వానించే దిశగా అడుగులు పడుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని, అలాగే ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించాలని సినిమా పెద్దలు భావిస్తున్నారు. గత నాలుగైదు నెలలుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా పరిశ్రమకు పెద్దగా సానుకూల వాతావరణం లేదు.
Also Read: మెగా ఫ్యాన్స్ ను కెలికిన అల్లు మామ..!
ఇప్పుడు బాలకృష్ణను అడ్డం పెట్టుకుని సినిమా పరిశ్రమ పెద్దలు.. ప్రభుత్వాలను బుట్టలో వేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వంతోనే కాకుండా, తెలంగాణ ప్రభుత్వంతో కూడా బాలకృష్ణకు మంచి సంబంధాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూదా బాలయ్యతో సన్నిహితంగానే ఉంటారు. ఈ సన్మాన కార్యక్రమానికి రేవంత్ రెడ్డిని ఆహ్వానించడం వెనక ప్రధాన కారణం ఆయనను శాంతింప చేయడమే అని తెలుస్తోంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సినిమా కార్యక్రమాలకు ఆయనను పెద్దగా ఆహ్వానించడం లేదు. ఈ కార్యక్రమం బాలకృష్ణది కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ని కూడా ఆహ్వానిస్తే కలిసి వస్తుందని సినిమా పెద్దలు ఒక వ్యూహం ప్రకారమే అడుగులు వేస్తున్నట్లు సమాచారం.