“వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుంది… 30 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పరిపాలిస్తాం.. ఒక్కటే గుర్తు పెట్టుకొండి… ఈసారి జగనన్న 2.0 కార్యకర్త కోసం ఎలా పని చేస్తుందో చూపిస్తాం.” ఇవి రెండు రోజుల క్రితం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ నేతలు, కార్యకర్తలతో చెప్పిన మాటలు. జగన్ 2.0 అనగానే కార్యకర్తలంతా తెగ సంబరపడిపోతున్నారు. ఇంకా చెప్పాలంటే… కొంతమంది అయితే… చెప్పాడంటే… చేస్తాడంతే అంటూ పాటలు కూడా పాడుతున్నారు. “జగన్ 1.0లో కార్యకర్తలకు అంత గొప్పగా ఏం చేయలేకపోయి ఉండొచ్చు… ప్రతి పథకం, ప్రతి విషయంలో మొదటగా ప్రజలే గుర్తుకు వచ్చి వారి కోసమే తాపత్రయపడ్డాను. కానీ.. ఇప్పుడు చంద్రబాబు మన కార్యకర్తలను పెడుతున్న ఇబ్బందులను చూశాను. కార్యకర్తల బాధలను గమనించాను. ఆ కార్యకర్తల కోసం మీ జగన్ అండగా ఉంటాడు.” అంటూ పెద్ద పెద్ద డైలాగులు కూడా వేశాడు జగన్.
Also Read : మెగా ఫ్యాన్స్ ను కెలికిన అల్లు మామ..!
అయితే జగన్ తన ఐదేళ్ల పాలనలో ఏం చేశాడు అనే విషయాన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. అమరావతికి బ్రేకులు, పోలవరం ప్రాజెక్టు విషయంలో వెనుకడుగు, గుంతలు పడిన రోడ్లు, నాసిరకం మద్యం, ఇసుక, మద్యం, మైనింగ్ మాఫియా, అంగన్వాడీ, ఉపాధ్యాయ, ఉద్యోగులపై దాడులు, ఇక అమరావతి రైతులపై దాడులు, మహిళలపై తప్పుడు కేసులు, దౌర్జన్యాలు, టీడీపీ కార్యకర్తల హత్యలు… నిర్లక్ష్యం కారణంగా కొట్టుకుపోయిన అన్నమయ్య, పింఛా ప్రాజెక్టులు, అక్రమ అరెస్టులు… ఇలా ఐదేళ్ల పాటు జరిగిన విధ్వంసాలను టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఇక ఐదేళ్ల పాటు కూడా టీడీపీ నేతలు ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగానికి తూట్లు పొడిచేలా పాలన సాగిందని గుర్తు చేస్తున్నారు. అయితే జగన్ 2.0 అంటూ వ్యాఖ్యలు చేసిన వెంటనే వైసీపీ సోషల్ మీడియా రెచ్చిపోయింది.
Also Read : ఢిల్లీ వెళ్ళండి సామి.. ఎంపీలకు జగన్ రిక్వెస్ట్
జగన్ 2.0 ఎలా ఉంటుందో తెలుసా అంటూ పోస్టులు పెడుతున్నారు. చివరికి వైసీపీ అప్‌డేట్స్ అధికారిక అకౌంట్‌లో కూడా జగన్ 2..0 అంటే… ఇది అంటూ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. RRR అనే అక్షరాలకు ఎరుపు రంగులో ప్రస్తావించింది. జగన్ వార్నింగ్ ఇస్తున్న ఫోటో… వెనుక తాత రాజారెడ్డి ఫోటో ఉంచింది. రాజారెడ్డి రాజ్యాంగం అంటూ కామెంట్ చేసింది. కింద “You Will See Original Jagan Reddy” అంటూ కామెంట్ పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. రాజారెడ్డి గురించి అందరికీ తెలిసిన విషయమే. కడప జిల్లాలో రాజారెడ్డి పెద్ద ఫ్యాక్షనిస్టు అనేది అందరికీ తెలుసు. ఆయన అరాచకాలు భరించలేక ప్రత్యర్థులు హత్య చేశారు కూడా. తాతకు మనవడిగా జగన్ కూడా ఐదేళ్ల పాటు అరాచక పాలన సాగించారనేది టీడీపీ నేతల ఆరోపణ. ఇప్పుడు అదే నిజమనేలా వైసీపీ సోషల్ మీడియా “రాజారెడ్డి రాజ్యాంగం” అంటూ ఫోటో విడుదల చేయడం చూస్తే… జగన్ 2.0 ఇంకెంత అరాచకంగా ఉంటుందో అనే మాట ఇప్పుడు బలంగా వినిపిస్తోంది.