Friday, September 12, 2025 03:12 PM
Friday, September 12, 2025 03:12 PM
roots

తెలంగాణాపై ఫోకస్.. లోకేష్ ఢిల్లీలో ఇంట్రస్టింగ్ సీన్..!

ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చిన రెండుసార్లు… తెలంగాణలో పార్టీ బలోపేతం అనే మాట ఎక్కువగా వినపడుతూ వచ్చింది. 2014 తర్వాత తెలంగాణలో క్రమంగా పార్టీ బలహీనపడుతూ వచ్చింది. కొన్ని కారణాలతో చంద్రబాబు నాయుడు కూడా తెలంగాణపై ఎక్కువగా దృష్టి పెట్టలేకపోయారు. ఇక ఇప్పుడు తెలంగాణలో పార్టీ బలోపేతానికి చంద్రబాబు నాయుడు దృష్టి సారిస్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్లాలని చంద్రబాబు పట్టుదలగా ఉన్నారు.

Also Read : రఘురామ వ్యాఖ్యలతో.. వైసీపీ నేతల్లో భయం..?

ఇక 2023 ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేయని టిడిపి… వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే కనీసం 20 నుంచి 30 స్థానాల్లో అయినా పోటీ చేయాలని పట్టుదలగా ఉంది. ఇందుకోసం ఇప్పటినుంచి గ్రౌండ్ వర్క్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఢిల్లీ పర్యటనకు వెళ్లిన మంత్రి నారా లోకేష్.. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో భేటి అయ్యారు. తెలంగాణలో పార్టీ బలోపేతంపై ఆయన ప్రశాంత్ కిషోర్ తో చర్చించినట్లు సమాచారం. రాజకీయంగా తెలంగాణలో ఉన్న పరిస్థితులు… అలాగే బలపడటానికి తీసుకోవాల్సిన చర్యలు వంటి వాటిని ప్రశాంత్ కిషోర్ తో లోకేష్ చర్చించినట్లుగా వార్తలు వస్తున్నాయి.

Also Read : చంద్రబాబుకు షర్మిల సలహా.. ఆ ఒక్కటి జాగ్రత్త…!

తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ ఫార్ములాను అమలు చేయాలని బిజెపి, టిడిపి ఏకతాటి మీదకు వచ్చాయి. దీనితో ప్రశాంత్ కిషోర్ తెలంగాణలో రంగంలోకి దిగే అవకాశాలు ఉండొచ్చు అనే అభిప్రాయాలు వినపడుతున్నాయి. అటు పార్టీ కార్యకర్తలు కూడా తెలంగాణలో టిడిపి దృష్టి పెట్టాలని కోరుతున్నారు. ఈ మధ్యకాలంలో కొంతమంది నేతలు పార్టీ మారేందుకు ఆసక్తి చూపించినా… ఆ తర్వాత అడుగులు పడలేదు. కొంతమంది నేతలు చంద్రబాబు నాయుడుతో భేటీ అయినా… పార్టీలో చేరిక విషయంలో మాత్రం ఆలస్యం జరుగుతూ వస్తోంది.

Also Read : పింఛన్ల పంపిణీపై ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు..!

అయితే ఈ ఆలస్యాన్ని ఎక్కువగా పెంచకుండా త్వరగానే నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు నాయుడు కూడా భావిస్తున్నారు. ఎలాగైనా సరే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బిజెపితో కలిసి పోటీ చేసేందుకు టిడిపి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో ప్రశాంత్ కిషోర్ పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టే అవకాశాలు ఉండవచ్చు అని తెలుస్తోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

పోల్స్