జనంలోకి వెళ్లేందుకు జనసేన పార్టీ నిర్ణయించుకుంది. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చాలా బిజీగా ఉండటంతో.. ఆ బాధ్యతలను సోదరుడు నాగబాబుకు అప్పగించారు. దీంతో తొలిసారి పుంగనూరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన సభలో నాగబాబు పాల్గొని వైసీపీ నేతలపై నిప్పులు చెరిగారు. తప్పుచేసిన వారిని జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. పెద్దిరెడ్డి అక్రమాలు అన్నీ ఇన్నీ కావన్నారు. ఇలా మొత్తం మీద జనసేన వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.
Also Read : కండలు కరగకుండా బరువు తగ్గాలంటే.. ఇవి ఫాలో అవ్వండి..!
జనసేనను జనానికి మరింత చేరువచేయడంలో భాగంగా పార్టీ అధినేత సిద్ధమయ్యారు. జనంలోకి జనసేన.. పేరుతో కార్యక్రమాన్ని చేపట్టారు. దీనిలో ప్రతినెలా నియోజకవర్గాల్లో పర్యటించాలని పవన్ భావించారు. అయితే పాలనా పరమైన షెడ్యూల్ కారణంగా పవన్ బిజీగా ఉండటంతో.. తాను అనుకున్నది సాధ్యపడటం లేదు. అయితే ఇప్పటికే ప్రకటన చేసిన నేపథ్యంలో క్యాడర్‌ను నిరుత్సాహ పరచకుండా ఉండాలని భావించారు. దీనిలో భాగంగా పవన్ సోదరుడు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబును జనంలోకి పంపాలని నిర్ణయించారు. నాగబాబు నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా సభలు, సమావేశాలు నిర్వహించడానికి ఏర్పాట్లుచేశారు. ద్వితీయ శ్రేణి నేతల్ని పార్టీలో చేర్చుకోవడం దగ్గర నుంచి క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి ఈ కార్యక్రమాలను ఉపయోగించనున్నారు.
Also Read : మరో రోహిత్.. సూర్యకుమార్ ను యువ ఆటగాళ్లే కాపాడారా..?
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత… పార్టీని పూర్తిస్థాయిలో బలోపేతం చేసుకోవడం కోసం పెద్ద ఎత్తున వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం ఇదే తరహా పథకంతో అడుగులు వేశారు. ముఖ్యంగా వైసీపీ గెలిచిన నియోజకవర్గాల్లో ముందుగా ఈ బహిరంగ సభలు పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇలా నాగబాబు మంత్రి అయిన తర్వాత పూర్తి బాధ్యతలను ఆయనకు అప్పగించబోతున్నారు. నాగబాబు ప్రతి జిల్లాలో పర్యటనలు చేయడం, ప్లీనరీ సమావేశాలను ఏర్పాటు చేయడం, పార్టీని పూర్తిస్థాయిలో బలోపేతం చేసే దిశగా పావులు కదుపుతున్నారు. ఇలా పార్టీ కార్యకర్తలతో సమావేశం కావడమే కాకుండా జనసేనలోకి అందరిని ఆహ్వానిస్తూ రాష్ట్రంలో తమ బలాన్ని పెంపొందించుకొని వచ్చే ఎన్నికల నాటికి మరిన్ని స్థానాల్లో పోటీ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. దీనిలో భాగంగా చిత్తూరు జిల్లా పుంగనూరులో జరిగిన సభలో నాగబాబు హాజరై వైసీపీ నేతల మీద ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Also Read : ఏపి రాజకీయాల్లో హాట్ టాపిక్ గా ఏబీవీ పోస్టింగ్
ఏపీలో కూటమిగా కలిసి పోటీచేసినా… తమ బలం పెంచుకునేందుకు జనసేన, టీడీపీ, బీజేపీ నేతలు ఎవరికి వారు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఎన్టీయే కూటమిలో ఇప్పటికే చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిన తెలుగువారి ఓట్ల కోసం ప్రచారం చేస్తున్నారు. ఈ ఎన్నికల హడావుడి అయ్యాక.. పవన్ కళ్యాణ్ కూడా ప్రజలతో ఉండేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వస్తుందని, ప్రజల సమస్యల పరిష్కారంతో పాటు, పార్టీ పటిష్టత కోసం పవన్ ప్రణాళికలతో ముందుకు సాగుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.